Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాలస్తీనాకు ఇజ్రాయెల్: సొరంగం ధ్వంసం

జెరూసలేం: పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్ కాంక్రియస్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.

హమాస్‌లో పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని దాని సాయంతోనే స్మగ్లింగ్‌ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ పైన దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారన్నారు.

Israel Destroys Tunnel From Gaza It Says Intended For Attacks

గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటిని కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్ట్ వరకు ఉందన్నారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు.

గ్యాస్ పైప్ లైన్ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందే వారు వైమానిక దాడులు నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+