మత కార్యక్రమంలో భారీగా తొక్కిసలాట..38 మందికి పైగా భక్తులు మృతి: గుట్టలుగా మృతదేహాలు
జెరూసలెం: ఇజ్రాయిల్ (Israel)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మత కార్యక్రమంలో సంభవించిన భారీ తొక్కిసలాటలో 38 మందికి పైగా భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన ఘటనగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాగ్ బీఒమర్ (Lag B'Omer) పేరుతో ప్రతి సంవత్సరమూ స్థానికులు పెద్ద ఎత్తున మత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. యూదులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. మంటలను రగిలించి అందులో పాత వస్తువులను పడేస్తారు. రాత్రి జాగారణ చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. మంటల చుట్టూ సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తారు.
Tragedy in Meron: MDA is fighting for the lives of dozens wounded, and will not give up until the last victim is evacuated.
— Magen David Adom (@Mdais) April 30, 2021
38 are in critical condition and still in the field
6 in critical condition who were evacuated
18 injured severely
2 moderately
39 lightly pic.twitter.com/xUWStFYqQh
ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతం గెలిలీలోని మౌంట్ మెరాన్‌లో ఈ తెల్లవారు జామున ఈ కార్యక్రామాన్ని నిర్వహించారు. వేలాదిమంది యూదులు అల్ట్రా అర్థోడాక్స్ దీనికి తరలివచ్చారు. కుటుంబాలతో సహా హాజరయ్యారు. రెండో శతాబ్దానికి చెందిన సగె రబ్బీ షిమోన్ బార్ యోచి సమాధి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నివసించే యూదులకు అతి పవిత్రమైన ప్రదేశం ఇది. తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందిర్శించాలని భావిస్తుంటారు. అలాంటి చోట భక్తులు ప్రార్థనలు నిర్వహిస్తోన్న సమయంలో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.
అక్కడున్న ఓ స్టేడియం కప్పు కూలిపోయిందంటూ వార్తలు రావడం వల్ల భక్తులు భయాందోళనలకు గురి కావరని, ఫలితంగా తొక్కిసలాట చోటు చేసుకుందనేది ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జాతీయ అత్యవసర సర్వీసుల విభాగం మెగాన్ డేవిడ్ ఆడమ్ (ఎండీఏ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 103 మందికి పైగా గాయపడినట్లు ఎండీఏ అధికారులు నిర్ధారించారు. గాయపడిన వారు ఇంకా చాలామంది ఉన్నారని తెలిపారు.

Recommended Video
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి వచ్చీపోయే అంబులెన్సులు, పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ బలగాల వాహనల సైరన్ మోతలతో ఆ ప్రదేశం మొత్తం భీతావహంగా మారింది. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన ఘటనగా వ్యాఖ్యానించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications