మొస్సాద్ తొమ్మిదేళ్ల మాస్టర్ ప్లాన్: పక్కా ఎగ్జిక్యూషన్
Lebanon Pagers blast: ఇజ్రాయెల్ చేపట్టిన దాడులతో అల్లకల్లోలానికి గురవుతోన్న లెబనాన్‌లో ఇటీవలే పేజర్లు పేలిపోయిన ఘటన ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 30 మంది వరకు హెజ్బొల్లా ఉగ్రవాదులు, సానుభూతిపరులు దుర్మరణం పాలయ్యారు. 4,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కిందటి నెల 27, 28 తేదీల్లో లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లు వినియోగించిన పేజర్లు వరుసగా పేలిపోయిన ఉదంతం తెలిసిందే. తొలుత రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. హెజ్బొల్లాకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం ఇది. ఆ తరువాత దేశవ్యాప్తంగా పలు చోట్ల పేజర్ల పేలుళ్లు సంభవించాయి.

వరుసగా ఒక్కో ప్రాంతంలో అనుమానాస్పద మెసేజ్ అందుకున్న ప్రతి పేజర్ కూడా భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. మొత్తంగా 1,500లకు పైగా పేజర్లు పేలిపోయినట్లు లెబనాన్ వెల్లడించింది. ఈ ఘటనలో పేజర్ల యూజర్లు, ఆ సమయంలో వారితో పాటు ఉన్న వాళ్లు, సానుభూతిపరులు.. ఇలా 30 మంది మృతి చెందారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటన పట్ల అప్పట్లో లెబనాన్ ఘాటుగా స్పందించింది. దీనికి ఇజ్రాయెల్ కారణమంటూ ఆరోపించింది. ఇజ్రాయెల్ చేపట్టిన సైబర్ దాడిగా అభివర్ణించింది. తమ దేశ సెక్యూరిటీ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఇజ్రాయెల్ వ్యవహరించిందంటూ మండిపడింది. ఆ దేశాన్ని ఉగ్రవాదిగా పేర్కొంది.
లెబనాన్ ఆరోపించినట్లే ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ప్రమేయం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ దేశ గూఢచర్య సంస్థ మొస్సాద్ మాస్టర్ ప్లాన్ ఉందని ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2015లో పేజర్ల పేలుడుకు వ్యూహాన్ని రచించిందని, దాన్ని ఇప్పుడు పక్కాగా ఎగ్జిక్యూట్ చేసిందని పేర్కొంది.
పేలిపోయిన ఆయా పేజర్లన్నీ కూడా అపోలో ఏఆర్924కు చెందినవి. వాటిని అపోలో అనే తైవాన్ తయారు చేసింది. వాటిని తయారు చేయడానికి అవసరమైన కొన్ని విడిపరికరాలను కొనుగోలు చేయడానికి తైవాన్ సంస్థ ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడే మొస్సాద్- ఈ ప్లాన్‌కు రూపకల్పన చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
2015 నుంచి దశలవారీగా ఆ పేజర్లల్లో కొన్ని బగ్స్ ఫిక్స్ చేసేలా విడిపరికరాలను అపోలో సంస్థకు సరఫరా చేసినట్లు వివరించింది. 2023లో హెజ్బొల్లా అదే అపోలో సంస్థతో వేల సంఖ్యలో పేజర్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఈ పేలుడు వస్తువులను అందులో అమర్చిందని, వాటిని సప్లై చేసినట్లు పేర్కొంది.
పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (Pentaerythritol Tetranitrate-PETN) అనే అధిక తీవ్రత గల పేలుడు పదార్థాన్ని ఇందులో అమర్చారని లెబనాన్ జాతీయ భద్రతాధికారి తెలిపారు. ఈ పీఈటీఎన్‌ను గుర్తించడం దాదాపుగా అసాధ్యమని, ఎలాంటి స్కానర్లు, డివైస్‌ల కంటికీ అది చిక్కదని అన్నారు.
ఒక్కో పేజర్‌లో 20 గ్రాముల బరువు ఉండే పీఈటీఎన్‌ను మొస్సాద్ అమర్చి ఉండొచ్చని అనుమానాలను వ్యక్తం చేశారు. పీఈటీఎన్‌ను టీఎన్‌టీ కంటే శక్తిమంతమైన పేలుడు పదార్థంగా భావిస్తారు. దీని రిలేటివ్ ఎఫెక్టివ్‌నెస్ ఫ్యాక్టర్ 1.66. పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు.
ఈ మధ్యకాలంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో దీని వినియోగం అధికమైంది. ఉగ్రవాదులకు ఇదొక శక్తిమంతమైన ఆయుధంగా మారింది. 1996లో తొలిసారిగా సౌదీ అరేబియాలో ఖోబర్ టవర్స్‌ను పేల్చివేయడానికి తొలిసారిగా ఈ పీఈటీఎన్‌ను వినియోగించారు. ఆ ఘటనలో 19 మంది అమెరికన్లు దుర్మరణం పాలయ్యారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications