వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మా నాన్నా అని బిడ్డతో పిలిపించుకోవడానికి మాకు 10 నెలలు పట్టింది'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తల్లి చేతిని పట్టుకున్న చిన్నారి

ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడం కష్టమని నీనా స్టీవెన్ ఎన్నడూ ఊహించలేదు.

"మేమా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు" అని నీనా అన్నారు.

ఆమె మూడేళ్ళలో నాలుగు సార్లు గర్భం ధరించారు. కానీ, ప్రతీసారీ గర్భాన్ని కోల్పోయారు.

"మూడేళ్ళలో నాకు నాలుగుసార్లు గర్భస్రావం జరిగింది. అది మాకిద్దరికీ చాలా భావోద్వేగాలతో కూడుకున్న సమయం" అని అన్నారు.

గర్భం నిలవకపోవడంతో మేము పిల్లలను పెంచుకోవాలని అనుకున్నాం. దాని కోసం ఇంటర్నెట్ లో కొంత రీసెర్చ్ చేసాం. ఆ రీసెర్చ్ లో మాకు 'ఎర్లీ పెర్మనన్స్ ప్లేస్‌మెంట్స్' గురించి కొంత సమాచారం లభించింది.

పెంపకం కోసం ఉన్న రెండేళ్ల లోపు పిల్లలను అధికారికంగా పెంపకానికి తీసుకోక ముందే ఒక కుటుంబ సభ్యుని సంరక్షణలో ఉంచే విధానాన్ని 'ఎర్లీ పెర్మనెన్స్ ప్లేస్‌మెంట్స్' అని అంటారు.

"ఆ పిల్లల సొంత తల్లితండ్రులు వారి సంరక్షణ బాధ్యతలను చూసుకోలేదని కోర్టు నిర్ణయిస్తే, ఆ పిల్లల సంరక్షణ చూసుకున్న కుటుంబమే తర్వాత వారిని పెంపకానికి తీసుకుంటారు" అని చిన్న పిల్లల చారిటీలను నిర్వహించే కోరం సంస్థకు చెందిన హన్నా మోస్ చెప్పారు.

1990ల చివరలో యూకేలో తొలి సారిగా ఎర్లీ పెర్మనన్స్ ప్లేస్‌మెంట్స్‌ను పైలట్ స్థాయిలో అమలు చేశారు.

ఈ విధానం ఇంగ్లాండ్, ఉత్తర ఇంగ్లాండ్‌లో అమలులో ఉంది. ఇంగ్లాండ్‌లో 2021-22 లో ఎర్లీ పెర్మనన్స్ పథకాలకు అదనంగా 5,00,000 పౌండ్లు (సుమారు రూ. 5 కోట్లు) ఇస్తామని ప్రభుత్వం జులైలో ప్రచురించిన అడాప్షన్ వ్యూహంలో పేర్కొంది.

ఈ విధానం బిడ్డకు స్థిరత్వాన్ని అందిస్తూ వివిధ ప్రదేశాల్లో బిడ్డను ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని అంటూ సంరక్షకులకు, పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచుతుందని ఈ ప్రకటనలో పేర్కొంది.

స్కాట్‌లాండ్‌లో ఎర్లీ పెర్మనన్స్ ప్లేస్‌మెంట్స్ అప్పుడప్పుడూ జరుగుతూ ఉండేవి. వేల్స్‌లో మాత్రం వచ్చే సంవత్సరం నుంచి మొదలవుతాయి.

నీనా, స్టీవెన్ కలిసి కోరం సంస్థ దగ్గర కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకోవడమే కాకుండా, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరవ్వడం, సంబంధిత పత్రాలను నింపడం లాంటి పనులు కూడా చేశారు.

ఈ శిక్షణ ముగిసిన తర్వాత సంస్థ సోషల్ వర్కర్ కొంత మంది పిల్లల వివరాలను షేర్ చేశారు. అందులో ఇంకా పుట్టని లియా వివరాలు కూడా ఉన్నాయి.

లియా పుట్టగానే ఆ బిడ్డ సంరక్షణ బాధ్యతలను చూసుకోవాలని నీనా దంపతులు అనుకున్నారు. అయితే, ఆ బిడ్డ సంరక్షణ కోసం కోర్టులు మరొకరిని నిర్ణయిస్తారేమోననే సందేహం కూడా వారికుంది.

కోర్టు విచారణ తర్వాత ఆ బిడ్డ తమకు దక్కకపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీనా స్టీవెన్ ఆ బిడ్డనే పెంచుకోవాలని ఆసక్తి చూపించారు. ఆ అనుభవం గుండెలను మెలిపెట్టేదిగా ఉంటుందని వారికి ముందే తెలుసు.

"కానీ, వారు సంస్థ దగ్గర తీసుకున్న శిక్షణ తమపై కాకుండా బిడ్డపై దృష్టి పెట్టేందుకు సహాయం చేసింది" అని నీనా చెప్పారు.

"దాంతో, బిడ్డను కోల్పోతామేమో అనేకంటే కూడా బిడ్డకేది ఉత్తమమని ఆలోచించడం మొదలుపెట్టాం" అని చెప్పారు.

కోర్టు ఆమోదించిన పక్షంలో లియాను ఆమె కుటుంబ సభ్యులెవరైనా చూసుకోవడం మంచిదని భావించారు.

లియాకు రెండు వారాల వయసు ఉన్నప్పుడు నీనా, స్టీవెన్ ఆ పాపను చూసేందుకు వెళ్లారు.

"మీరు రైలులో ప్రయాణిస్తూ ఎవరో జన్మనిచ్చిన బిడ్డ గురించి మీకేమీ తెలియకుండానే ఆ బిడ్డను చూసేందుకు వెళ్లడం ఎలా ఉంటుందో ఊహించండి" అని నీనా అంటారు.

"ఆ ప్రయాణంలో మేమేమి చేస్తున్నామనే సందేహం వెంటాడింది. మేమేం చేస్తున్నామనే ఆలోచన చాలా భయపెట్టేదిగా ఉంది. కానీ, స్టీవెన్ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. నేను నాలో నేనే లోపల్లోపల చాలా ఆందోళనకు గురయ్యాను" అని చెప్పారు.

లియా పసిపిల్లల వార్డులో ఉంది. అక్కడే ఆ చిన్నారి మరో అయిదు వారాల పాటు ఉండాలని తెలిసింది.

"మొదటి రోజు నుంచీ బిడ్డను చూసుకోవాలని చెబుతారు. అంటే, ఆ బిడ్డకు దగ్గరవ్వడం, మన వాసనను బిడ్డ గుర్తు పట్టడం లాంటివి జరుగుతాయి" అని నీనా చెప్పారు.

కానీ, లియా పుట్టిన స్థలం నుంచి నీనా కుటుంబం దూరంగా నివసిస్తుండటంతో అటూ ఇటూ చాలా ప్రయాణం చేయాల్సి వచ్చేది.

అకస్మాత్తుగా ఒక రోజు చట్టపరమైన కారణాల రీత్యా వారిని ఆసుపత్రికి వెళ్లవద్దని చెప్పారు. కానీ, ఈ ఆటంకాన్ని కూడా అధిగమించి లియాను తమ ఇంటికి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.


ఎర్లీ పెర్మనెన్స్ ప్రయోజనాలు

  • "ఎర్లీ పెర్మ్ నెన్స్ వల్ల పిల్లల జీవితాల్లో ఎక్కువ ఆటంకాలు వాటిల్లకుండా పెంపకం తీసుకున్న కుటుంబంతో త్వరగా అనుబంధం ఏర్పర్చుకునే వీలు కలుగుతుంది" అని హన్నా మోస్ చెబుతారు.
  • "సంరక్షణ గృహాల్లో ఉండే పిల్లల పెంపకం గురించి కోర్టులు నిర్ణయం తీసుకునే లోపు కుటుంబం నుంచి సంరక్షణ గృహాలకు, ఆ తర్వాత పెంపకం తీసుకునే కుటుంబానికి మారే ప్రక్రియలో అనేక మార్పులను చవిచూస్తారు." ఇటువంటి మార్పులు పిల్లల మానసిక ఆరోగ్యం, అభివృద్ధి పై చాలా ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు చెప్పినట్లు మోస్ చెప్పారు.
  • "కానీ, పెంచుకోవాలని అనుకుంటున్న వారు పిల్లల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వగలగాలి" అని ఆమె అన్నారు.

లియా తండ్రి ఎవరో స్పష్టంగా తెలియలేదు. నీనా, స్టీవెన్ దగ్గరకు లియా చేరిన వారం రోజుల్లోనే ఆ తండ్రెవరో పెటర్నిటీ పరీక్ష ద్వారా తేలింది.

ఆ పాపను చూసుకునే పనిని ఆయన తన తల్లికి అప్పగించారు.

"నేరుగా చెప్పాలంటే, మేం ఆ బిడ్డను చూసుకుంటున్నాం. అదే సమయంలో మేం చూసుకోవలసిన అవసరం కూడా లేదు. ఇలా కనీసం 7 నెలలు చేయాల్సి వచ్చింది. అది మాకు చాలా కఠినమైన సమయం" అని నీనా చెప్పారు.

లియా కుటుంబంతో కలవడానికి వెళుతున్నప్పుడు వారు కేవలం లియా కోసం వెళుతున్న సంరక్షకులే తప్ప సొంత తల్లితండ్రులు కాదనే ఆలోచన బలపడేది. చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిని లియా అమ్మా, నాన్నలాగానే చూసేవారు. నీనా వారినెప్పుడూ సరిదిద్దుతూ ఉండేవారు.

"నేను నా పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నానేమో అని వారనుకునేవారేమో. కానీ, లియా కూడా తన సొంత కుటుంబం గురించి మనసులో పెట్టుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తాను" అని నీనా అన్నారు.

కోర్టులో లియా సంరక్షణకు సంబంధించిన విచారణ 7 నెలల పాటు సాగింది.

"చివరకు తుది నిర్ణయం వెలువడే ముందు వరకూ ప్రతిరోజూ ఏదైనా వార్తను వింటామేమోనని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ అనిశ్చితి భరించలేనిది" అని నీనా అన్నారు.

"కానీ, జీవితం ఆగదు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ అనుభవాన్నీ ఎదుర్కోవాల్సిందే. మరో వైపు వైపు చిన్న పిల్లలను చూసుకోవడం అలసటతో కూడుకుని ఒత్తిడి సృష్టిస్తుంది" అని అన్నారు.

చివరకు కోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. లియా శాశ్వతంగా తన నానమ్మతో ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది.

పిల్లలను చిన్నప్పుడే సంరక్షణ బాధ్యతలు తీసుకున్న వారు ఆ పిల్లలతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ పిల్లల నుంచి దూరం కావడం వారికి చాలా కష్టంగా ఉంటుంది.

లియాను ఆమె నానమ్మతో కలిసి చూసేందుకు స్టీవెన్‌తో కలిసి వెళ్ళినప్పుడు ఆమె చాలా భావోద్వేగానికి గురయ్యారు.

కానీ, వారి మధ్య తరచూ రాకపోకలు జరగడంతో ఒక విధమైన అనుబంధం ఏర్పడింది. వారు చివరి వీడ్కోలు చెప్పే సమయానికి లియా నానమ్మ సంరక్షణలో బాగా పెరుగుతుందనే నమ్మకం ఏర్పడింది.

"లియా నానమ్మ మాకొక అందమైన కార్డు ఇచ్చారు. ఒక చిన్న బహుమతిని కూడా ఇచ్చారు.

ఆమెను సురక్షితంగా చూసుకుంటానని మాకు చెప్పారు. మాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు" అని నీనా చెప్పారు.

"అదొక ప్రత్యేకమైన భావోద్వేగాలతో కూడుకున్న క్షణం. "నేను పాపను బాగా చూసుకుంటాను" అనే మాటలు మరీ ప్రత్యేకమైనవి. మాకు కావల్సింది కూడా అదే" అని నీనా అన్నారు.

Short presentational grey line

ఇంట్లో కమ్ముకున్న విచారం నుంచి బయట పడేందుకు నీనా స్టీవెన్ హాలిడేకు వెళ్లారు.

కానీ, వారు తిరిగి ఎర్లీ పెర్మనెన్స్ విధానం ద్వారా బిడ్డను పెంచుకోవాలని అనుకున్నారు.

"ఈ విధానంలో ఏదో ప్రత్యేకత ఉంది" అని నీనా అన్నారు. మేము తిరిగి బిడ్డను పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భావించాం.

అయితే, అదేమంత మంచి ఆలోచన కాదని స్నేహితులు, కుటుంబ సభ్యులు వారించారు. కానీ, నీనా , స్టీవెన్ తమ నిర్ణయంతో ముందుకు వెళ్లారు.

మరో ఆరు నెలల తర్వాత జాస్మిన్ అనే చిన్నారి సంరక్షణ చూసుకోవడం మొదలుపెట్టారు.

లియా విషయంలో జరిగినట్లుగానే, జాస్మిన్ తల్లితో తరచుగా సమావేశమవుతూ ఉండేవారు. ఆమె బిడ్డను చూసుకునేందుకు ఆమె ఆమోదించినట్లే అనిపించింది.

ఈ సారి వారు 10 నెలల పాటూ ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, చివరకు ఆ చిన్నారిని దత్తత తీసుకోవడం విజయవంతమైంది. దాంతో, వారు జాస్మిన్ కు చట్టబద్ధంగా తల్లితండ్రులయ్యారు.

చిన్నారిని లాలిస్తున్న తండ్రి

అప్పటి నుంచీ వారు జాస్మిన్ అమ్మా నాన్నలమని చెప్పుకోవడం మొదలుపెట్టారు.

"ఇప్పటికీ నన్ను నేను అమ్మను అని చెప్పుకోవడాన్ని ఏదో ఇబ్బందికరంగా భావిస్తూ ఉంటాను" అని నీనా అన్నారు.

"నేను పెంపుడు తల్లి నుంచి నిజమైన తల్లిననే ఆలోచన నా మనసులో స్థిరపడటానికి సమయం పట్టింది" అని చెప్పారు.

జాస్మిన్‌కు ప్రస్తుతం మూడేళ్లు వచ్చాయి. ఆ చిన్నారి గలగలా మాట్లాడుతూ, బుగ్గలతో అందంగా ఉంటుంది" అని నీనా చెప్పారు.

"జాస్మిన్ చాలా బాగుంటుంది. కొంచెం సిగ్గుపడుతుంది కానీ, ఆత్మ విశ్వాసంతో ఉంటుంది. సరదాగా ఉంటుంది. అందరితో కలవడాన్ని, చదవడాన్ని ఇష్టపడుతుంది. తానొక ప్రత్యేకమైన అమ్మాయి" అని అన్నారు.

అయితే, చిన్నప్పటి నుంచే సంరక్షణ చూసుకునే విధానం అందరికీ పని చేయదని నీనా అంటారు.

ఆ చిన్నారిని సంరక్షణ కేంద్రంలోనే ఉంచడం ముఖ్యం.

ఈ విషయంలో కుటుంబం, స్నేహితులు, పొరుగువారి సహకారం చాలా కీలకమని నీనా అంటారు.

"పిల్లల విషయంలో ఎలాంటి తీర్పులూ ఉండవు. వారిని ఆమోదించడమే ఉంటుంది. మా పొరుగువారు కూడా చాలా దయగల వారు. నాకు గర్భం రాకుండానే బిడ్డను ఎత్తుకోవడం వారికి చాలా వింతగా అనిపించి ఉండవచ్చు. ఆ మరుసటి రోజే నేనొక చిన్న బిడ్డతో కలిసి ఉండటాన్ని చూశారు. కానీ, వారు మమ్మల్ని ఆమోదించారు" అని చెప్పారు.

ఆమె జీవిత చరిత్ర గురించి తెలియచేసేందుకు నీనా స్టీవెన్ కోరం తో కలిసి పని చేస్తున్నారు. దీని వల్ల జాస్మిన్ తన బాల్యం గురించి తెలుసుకుంటుందని భావిస్తున్నారు.

వారు లియా నానమ్మతో కూడా తరచుగా మాట్లాడుతూనే ఉన్నారు. లియా పుట్టిన రోజుకు ఆమెకు బహుమతి పంపించారు. లియా నానమ్మ కూడా ఉత్తరాలు రాస్తూ లియా ఫోటోలు పంపిస్తూ ఉంటారు.

జాస్మిన్ కూడా ఆ ఫోటోలు చూస్తుంది. నీనా, స్టీవెన్‌లతో లియా గురించి మాట్లాడుతుంది.

"మనల్ని ప్రేమిస్తూ, మనల్ని చూసుకునే వారే మన కుటుంబం. మనం రక్త సంబంధీకులమా కాదా అనేది ముఖ్యం కానే కాదు" అని నీనా అంటారు.

(ఈ కథనంలో గోప్యత కోసం వ్యక్తుల పేర్లను మార్చడమైనది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
It took 10months for the child to call us Mom and Dad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X