వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గృహ నిర్బంధంలో జైష్ చీఫ్ మసూద్ అజహర్

|
Google Oneindia TeluguNews

లాహోర్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉగ్రదాడుల కేసుకు సంబంధించి జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్టులు, సంస్థ సభ్యులపై తీసుకుంటున్న చర్యలపై పాకిస్థాన్ నోరువిప్పింది. ఎట్టకేలకు ఉగ్రదాడుల సూత్రదారి, జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను గృహనిర్బంధ కస్టడీలో ఉన్నాడని చెప్పింది.

అయితే జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను అరెస్టు చెయ్యలేదని పాక్ న్యాయశాఖ మంత్రి సనావుల్లా తెలిపారు. మసూద్ ను అరెస్టు చేసినట్లు గురువారం పాక్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన వార్తలపై పాకిస్థాన్ వివరణ ఇచ్చుకుంది. భారత్ లోని పఠాన్ కోట్ దాడులకు భాద్యులెవరు అని కచ్చితంగా తెలియకుండా మౌలానా మసూద్ అజహర్ ను ఎలా అరెస్టు చేస్తామని న్యాయశాఖ మంత్రి సనావుల్లా ప్రశ్నించారు.

Jaish Chief Masood Azhar in Protective Custody in Lahore in Pakistan

ఈ ఘటనపై పాకిస్థాన్ దర్యాప్తు చేపట్టిందని, సాక్షాధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. భారత్ వాదన ప్రకారం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ క్యాంపులో జరిగిన ఉగ్రదాడికి మౌలానా మసూద్ అజహర్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తున్నది.

మసూద్ అరెస్టు స్వాగతించదగినది, పాక్ తీసుకున్న తొలిచర్య సంతోషమే. అయితే అతడి అరెస్టును పాక్ అధికారికంగా ప్రకటించకపోవడంతో భారత్ విదేశాంగ శాఖ మండిపడింది. ఈ నేపధ్యంలో పాక్ మంత్రి మసూద్ విషయంలో పైవిధంగా స్పందించారు.

English summary
We have taken Maulana Azhar and his fellows under protective custody in connection with the Pathankot incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X