ఐదువేల మంది మహిళలతో ఆత్మాహుతి దాడులకు ప్లాన్స్..!!
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మరోసారి తన కుట్రను బయటపెట్టింది. తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తూ మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ మహిళా గ్రూప్ కి నేతృత్వం వహిస్తోంది. కాగా జమాతుల్-ముమినాత్ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారు చేస్తోంది. అయితే కొద్ది వారాల వ్యవధిలోనే ఈ గ్రూప్ సుమారు 5 వేల మంది మహిళల్ని ఆకర్షించినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు.
ఐదువేల మందితో..
ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోందని జైష్ చీఫ్ మసూద్ అజార్ తెలిపాడు. ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. "జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోంది. చాలా తక్కువ సమయంలోనే 5,000 మందికిపైగా మహిళలు చేరారు. చాలా మంది సోదరీమణులు నియామకం పొందిన వెంటనే తమ మానస్థిక స్థితిమారిపోయినట్లు చెబుతున్నారు. జీవిత లక్ష్యాన్ని గ్రహించినట్లు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ముంటాజియా (మేనేజర్) ఉంటారు" అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

జమాతుల్-ముమినాత్ కోసం నియామక డ్రైవ్ ఈ ఏడాది అక్టోబర్ 8న జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ ఉస్మాన్-ఓ-అలీలో ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌లో భాగంగా పాక్‌లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి నుంచి మహిళలను ఉగ్రవాద సంస్థలోకి చేర్చుకున్నారు.
ఈ సంస్థ రూ.500 ఫీజుతో 40 నిమిషాలు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ.. మహిళల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications