
మే 28న వాషింగ్టన్‌లో జైశంకర్, బ్లింకెన్ భేటీ- భారత్‌కు కోవిడ్ సాయం, క్వాడ్‌పైనే చర్చ
భారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్‌కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్‌కు అవసరమైన కోవిడ్ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్ సిద్దం చేసుకోనున్నారు.
భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఈ నెల 24 నుంచి 27 వరకూ అమెరికాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన అమెరికా బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా జైశంకర్ వాషింగ్టన్, న్యూయార్క్‌ను సందర్శిస్తారు. విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ పర్యటనలో భారత విదేశామంగ మంత్రి జైశంకర్‌ను కలవడానికి మరియు COVID-19 సాయం, క్వాడ్ ద్వారా ఇండో-పసిఫిక్ సహకారాన్ని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలు, మెరుగైన UN మరియు బహుపాక్షిక సహకారం మరియు ఇతర భాగస్వామ్య ప్రాంతీయ ప్రాంతాలతో సహా విస్తృత సమస్యలపై చర్చించడానికి ఎదురుచూస్తున్నారని అమెరికా ప్రకటించింది భద్రత మరియు ఆర్థిక ప్రాధాన్యతలే లక్ష్యంగా ఈ సమావేశం సాగనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

జైశంకర్ తన పర్యటనలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ (న్యూయార్క్‌లో) తో పాటు టీకా తయారీదారులు ఫైజర్, మోడెర్నా మరియు జాన్సన్ అండ్ జాన్సన్‌లతో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పైనా బిడెన్ ప్రభుత్వ వర్గాలతో జైశంకర్ చర్చించనున్నారు; యు.ఎస్ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ యొక్క 60 మిలియన్ డోసుల్ని విదేశాలకు పంపుతోంది. ప్రస్తుతం ఈ డోసులు భారత్‌కు ఎంతో అత్యవసరంగా మారాయి. దీంతో ఆస్ట్రాజెనెకాను భారత్‌కు పంపే విషయంపై జైశంకర్ వారితో చర్చించనున్నారు. జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్ భేటీ శుక్రవారు జరిగే అవకాశముంది.