వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు హైస్పీడ్ రైళ్లు అమ్మేందుకు చైనా, జపాన్ పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌కు తమ తమ హైస్పీడ్ రైళ్లను అమ్మేందుకు జపాన్, చైనాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే జపాన్.. అహ్మదాబాద్ - ముంబై కారిడార్ మధ్య హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ సాధ్యాసాధ్యాల పైన స్టడీ చేస్తోంది. దీని పైన ప్రధాని నరేంద్ర మోడీతో జపాన్ అధికారులు ఆయన జపాన్ పర్యటనలో పంచుకోనున్నారు.

వచ్చే వారం నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. అప్పుడు దీని పైన వారు తెలియజేయనున్నారు. జపాన్ ప్రధాని షింజో ఎబే కూడా దీని పైన దృష్టి సారించారు. నరేంద్ర మోడీ ఈ శనివారం క్యోటోలో దిగనున్నారు.

Japan, China in race to sell India their high-speed trains

మరోవైపు చైనా కూడా కూడా తమ హైస్పీడ్ రైళ్లను భారత్‌కు అమ్మేందుకు పోటీ పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైస్పీడ్ రైలు నెట్ వర్క్ చైనాలో ఉంది. దీంతో వారు కూడా భారత్‌కు తమ హైస్పీడ్ రైళ్లను అమ్మేందుకు చూస్తున్నారు. కాగా, చైనా అమ్మజూస్తున్న హైస్పీడ్ రైళ్లు జపాన్ హైస్పీడ్ రైళ్ల కంటే కొంత చవకట.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. అప్పుడు ఈ అంశం చర్చకు వచ్చే అవకాశముంది. జపాన్ దేశం నాణ్యమైన, అత్యంత భద్రత కలిగిన హైస్పీడ్ రైళ్లు అమ్ముతోంది. చైనా తక్కువ ధరకే హైస్పీడ్ రైళ్లను అమ్ముతోంది.

English summary
China and Japan are once again in competition, this time for the lucrative high speed rail network market in India and many more news from across the globe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X