Japan Tsunami: సునామీ అంచున జపాన్-తీవ్ర హెచ్చరికలు-తీరాల ఖాళీ..!
జపాన్ లో ఇవాళ సంభవించిన 7.4 తీవ్రతతో కూడిన భూకంపం (Earthquake) సునామీ (Tsunami)కి దారి తీసింది. జపాన్ తీరంలో భూకంపం కారణంగా భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసి ప్రజల్ని తీర ప్రాంతాల నుంచి తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరుతోంది. దీంతో జపాన్ సునామీ వల్ల ఏం జరగబోతోందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవాళ జపాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. దేశంలో పలు చోట్ల రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇవాటే ప్రిఫెక్చర్, హొక్కైడోలకు అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ది జపాన్ టైమ్స్ ప్రకారం, ఈ శక్తివంతమైన భూకంపం ఇవాటే తీరానికి దూరంగా సంభవించింది. భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున అధికారులు అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. సముద్రంలోని చేపల వేట పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ అలలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tsunami heads for Japan coast after massive 7.4-magnitude earthquake
— Shakeel Yasar Ullah (@yasarullah) April 20, 2026
Japan tsunami alert: Authorities have cautioned that waves as high as 3 metres could reach parts of Iwate Prefecture and Hokkaido pic.twitter.com/mvxuOpS2xA
ప్రధానమంత్రి సనాయ్ తకైచి అత్యవసర కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ప్రభావిత ప్రాంతాల్లోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని టోక్యోలోని తన కార్యాలయంలో తకైచి ప్రకటించారు. ప్రభుత్వ ప్రసార సంస్థ NHK ప్రకారం, ఒట్సుచి, కమాయిషితో సహా అనేక ఓడరేవు పట్టణాలు వేలాది మంది నివాసితులను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశాయి.అలలు తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున, అధికారులు నివాసితులను తీరప్రాంతాలకు దూరంగా ఉండమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications