వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు జపాన్ షాక్.. "మోస్ట్ ఫేవర్డ్ నేసన్" హాదాను రద్దు.. ఆంక్షలతో పుతిన్ సతమతం

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై దాడుల‌కు దిగిన రష్యాపై ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఆంక్షలు విధిస్తూ మాస్కో దూకుడును కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గ‌డం లేదు. న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకుంటూ దాడులను మరింత ముమ్మ‌రం చేశారు. దీంతో ప్రపంచ దేశాలు మరింత ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్ తో పాటు అనేక దేశాలు ర‌ష్యాపై తీవ్ర ఆంక్ష‌లు విధించారు. యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా రష్యా చర్యలపై జపాన్ తీవ్రంగా మండిపడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

రష్యాకు జ‌పాన్ కల్పించిన "మోస్ట్ ఫేవర్డ్ నేసన్" వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు ఆదేశ‌ ప్రధాని ఫుమియో కిషిడా వెల్లడించారు. ఐఎంఎఫ్‌తో సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రష్యాకు రుణాలు లభించకుండా అడ్డుకుంటామని హెచ్చ‌రించారు. ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ఫుమియో కిషిడా తెలిపారు. అంతే కాకుండా రష్యాకు లగ్జరీ ప్రోడక్ట్‌ల‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు రష్యా వస్తువుల దిగుమతులను కూడా ఆపివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Japan Shock to Russia revoke most favored nation trade status

ఉక్రెయిన్‌పై ఒంటెద్దుపోక‌డ‌ల‌తో విరుచుకుప‌డుతున్న ర‌ష్యా చర్య‌ల‌ను చూస్తూ ఉండేది లేద‌ని జపాన్ హెచ్చ‌రించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న బిలియనీర్ల ఆస్తులపై గురిపెట్టింది. వాటిని స్తంభింపజేసింది. అటు ఉన్నతాధికారుల ఆస్తులను కూడా ఫీజ్ చేసింది. మిలటరీ ప్రయోజనాల కోసం వినియోగించే అత్యున్నత స్థాయి సాంకేతిక వస్తువుల ఎగుమతులను కూడా నిషేధించింది. ర‌ష్యా దాడుల‌తో అల్లాడుతున్న ఉక్రెయిన్ సాయాన్ని ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు వెళ్తున్న పౌరుల కోసం మానవతా సాయాన్ని పెంచింది. నౌకల ద్వారా మందులు, ఆహారం , సహా సామాగ్రిని ఉక్రెయిన్ కు పంపుతున్నట్లు ఈమేర‌కు జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిడా తెలిపారు.

English summary
Japan Shock to Russia revoke most favored nation trade status
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X