వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఉ.కొరియాపై యుద్దానికి 54% సై, పారిపోయిన 2 వేల మంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోక్యో: ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా జపాన్ ప్రజలు ఉత్తరకొరియాపై యుద్దం చేయాలని కోరుకొంటున్నారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్‌ తీరుపై జపాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కిమ్‌కు బుద్ది చెప్పాలని వారు కోరుకొంటున్నారు.

కిమ్‌కు ఏమైంది, 60 రోజులుగా ఏమయ్యాడు: వ్యూహత్మక మౌనమేనా?కిమ్‌కు ఏమైంది, 60 రోజులుగా ఏమయ్యాడు: వ్యూహత్మక మౌనమేనా?

రెండు నెలల క్రితం వరకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. నిత్యం ఏదో ఒక అణు పరీక్ష, క్షిపణి పరీక్షలు నిర్వహించారు.

ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడ బేఖాతర్ చేశారు కిమ్ జంగ్ ఉన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ ‌కు హెచ్చరికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే జపాన్, దక్షిణ కొరియాలు కూడ ఉత్తరకొరియాకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఉత్తరకొరియాకు సమీపంలో జపాన్, దక్షిణ కొరియా విమానాలు రెడీగా ఉన్నాయి.

ఉత్తరకొరియాపై యుద్దానికి సై అంటున్న జపాన్

ఉత్తరకొరియాపై యుద్దానికి సై అంటున్న జపాన్


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ను అదుపులోకి తీసుకురావాలంటే యుద్ధం జరగాల్సిందేనని, అమెరికాతో కలిసి జపాన్ యుద్ధాన్ని ప్రారంభించాలని అత్యధిక జపాన్ ప్రజలు కోరుకుంటున్నారు. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడం, ఉద్రిక్తతలపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిత్యం భయంతో చచ్చే బదులుగా యుద్దమే మేలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

యుద్దానికి 54 శాతం ప్రజలు సై

యుద్దానికి 54 శాతం ప్రజలు సై

ఉత్తరకొరియాపై యుద్దం చేయాలని జపాన్‌లో 54 శాతం ప్రజలు కోరుకొంటున్నారు. . దాదాపు 54 శాతం మంది జపాన్ ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు, కిమ్‌పై యుద్ధం ప్రకటించాలని సూచిస్తున్నారు. కేవలం 39.4 శాతం ప్రజలు మాత్రమే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని సూచిస్తున్నారు.

అణుదాడి భయంతో..

అణుదాడి భయంతో..

ఉత్తరకొరియా ఏ క్షణంలోనైనా అణు దాడులు చేయవచ్చనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జపాన్ ప్రజలు యుద్దానికి మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఉత్తరకొరియా అదినేత కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తున్న తీరుతో జపాన్ ప్రజలు తీవ్రంగా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పారిపోయిన 2 వేల మంది

పారిపోయిన 2 వేల మంది

ఉత్తరకొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ తీరుతో జపాన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు కిమ్ ఏం చేస్తారోననే భయంతో దాదాపు 2000 మంది భయంతో దేశం వదిలి వెళ్లారని సర్వేలో వెల్లడైందని జపాన్ టైమ్స్ ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించిన అనంతరం నిర్వహించిన పోల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది.

English summary
Japan has for months urged its citizens to prepare for a possible nuclear war from North Korea, holding safety drills in schools and warning fisherman about surviving a missile attack. The tension has now reached an apex, with a majority of Japanese saying they want their government to take action against North Korean leader Kim Jong Un, not just engage him through diplomacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X