ఇస్లామిక్ స్టేట్ వార్నింగ్: జపాన్ హై అలర్ట్
టోక్యో: ఉగ్రవాదులు దాడులు చేస్తామని బెదిరించడంతో జపాన్ అలర్ట్ అయ్యింది. ప్రపంచ దేశాల్లోని తమ విదేశాంగ శాఖ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని తమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇండోనేషియా, హెర్జిగోవినా, మలేషియా, బోస్నియా లో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) ప్రకటించారు. ఈ నేపద్యంలో జపాన్ వేగంగా స్పందించింది. అత్యవసరంగా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసింది.
అవసరం అయితే మరింతమంది సైనికులను సమీకరించుకోవాలని విదేశాంగ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయని శుక్రవారం జపాన్ విదేశాంగ శాఖ మంత్రి ఫూమియో కిషీదా స్థానిక మీడియాకుచెప్పారు.

ఈ నాలుగు దేశాలతో పాటు జపాన్ విదేశాంగ శాఖకు చెందిన అన్ని కార్యాలయాలకు భద్రత కల్పిస్తామని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఒక ఆంగ్ల వెబ్ సైట్ కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించారు. ఇద్దరు జపానీయులను బంధీలుగా పట్టుకుని వారి తలలు నరికేశారు.
8 నెలల క్రితం ఇద్దరు జపనీయులు ఇస్లామిక్ స్టేట చేతిలో హత్యకు గురైనారు. జపాన్ మీద ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు పగ పెంచుకున్నారని గుర్తించిన జపాన్ పసిపిక్ తీరం వెంబడి ఉన్న అన్ని దేశాల్లోని తమ విదేశాంగ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications