చైనాకు షాక్: జపాన్ చేతికి బుల్లెట్ రైలు ప్రాజెక్టు

న్యూఢిల్లీ: భారత్ లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు జపాన్ చేజిక్కించుకోవడంతో చైనా షాక్ కు గురైయ్యింది. అయితే చైనా భుజాలు తట్టుకుంది. తమకు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా చాల అవకాశాలు ఉన్నాయని, బుల్లెట్ రైలు ప్రాజెక్టు చాల చిన్నదని చైనా సమర్థించుకుంటున్నది.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు మీద చైనా చాల ఆశలు పెట్టుకుంది. అయితే రూ. 98,000 వేల కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టును జపాన్ కు ఇవ్వాలని బుధవారం క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం జపాన్ ప్రధాని షిజో అబే భారత్ పర్యటనకు వస్తున్నారు.

మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటిస్తారు. ఈ సందర్బంగా జపాన్ ప్రధాని షిజో అబే ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చైనా మొదటి నుంచి ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపించింది.

Japan winning the contract to build India's first bullet train project

అయితే డిజైన్ మేనేజ్ మెంట్ లోపాలు ఉన్నాయని భారత్ గుర్తించింది. అంతే కాకుండా గతంలో చైనాలోని వెన్ జూ నగరంలో జరిగిన బుల్లెట్ రైలు ప్రమాదంలో 40 మంది మరణించారు. 200 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి.

ఇలాంటి లోపాలు గుర్తించిన భారత్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు చైనా కంటే జపాన్ కు అప్పగించడం మంచిదని నిర్ణయం తీసుకుంది. అరవింద్ పనగాడియా నేతృత్వంలోని ప్రత్యేక కమిటి జపాన్ రైల్వే పీన్ కన్ సేన్ సిస్టమ్ అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, సమయపాలన పాటిస్తున్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+