Hangover Leave: మందుబాబులు మెచ్చే ఉద్యోగం.. ఫ్రీగా ఆఫీసులోనే తాగొచ్చు, ఆపై హ్యాంగోవర్ లీవ్ తీసుకోవచ్చు..

Hangover Leave: ఒక కంపెనీ మార్కెట్ లో రాణించాలంటే ముఖ్యంగా ఉద్యోగులు కంపెనీకి విధేయులుగా ఉండాలి. ప్రతి కంపెనీ నిజాయితీపరులైన ఉద్యోగుల కోసం వెతకడం సాధారణమే. కంపెనీని అభివృద్ధి చేసేందుకు ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించేందుకు చాలా సంస్థలు కొత్త కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఎక్కువ జీతం ఇవ్వడం, పండుగలు, బర్త్ డేలు, పెళ్లి రోజుల వంటి వాటికి బహుమతులను పంపిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. కొన్ని కంపెనీలు పార్టీలు, భోజనం చేశాక కాసేపు కునుకు తేసేందుకు స్లీపింగ్ అవర్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాయి.

కానీ జపాన్ కు చెందిన ఓ కంపెనీ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఆలోచించింది. జపాన్ కు చెందిన ట్రస్ట్ రింగ్ అనే సంస్థ సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు తాగినంత మద్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. అంతే కాకుండా తర్వాత రోజు తాగిన కిక్కు దిగకపోతే.. హ్యాంగోవర్ సెలవును కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా మద్యం అధికంగా తాగితే ఈ సెలవును ఉపయోగించుకుని మత్తు దిగాక విధులకు హాజరు కావచ్చు. జపాన్ లోని ఒసాకాలో ట్రస్ట్ రింగ్ అనే చిన్న ఐటీ కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Japanese Company Offers Free Alcohol and Hangover Leave to Employees
ఉద్యోగులను ఆకర్షించేందుకు ట్రస్ట్ రింగ్ కంపెనీ ఎవరూ ఊహించని ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అంత తాగాలి, ఇంత తాగాలి అనే నిబంధనలు పెట్టకుండా.. మీకు నచ్చినంత తాగమంటూ మందుబాబుల మనసు దోచేలా వివరించింది. మత్తు ఎక్కువై పడుకోవాలని అనుకునే వాళ్ల కోసం హ్యాంగోవర్ లీవ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సెలవు తీసుకుని ఇంటికెళ్లి హాయిగా పడుకుని.. మత్తు దిగిన తర్వాత విధుల్లో చేరవచ్చు. ఈ క్రమంలో అక్కడి ఉద్యోగులు ఈ పథకాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. ఎంచక్కా మద్యం సేవిస్తూనే పనులు చేసుకుంటున్నారు. మందు ఎక్కువైతే హ్యాంగోవర్ లీవ్ తీసుకుని నిద్రపోతున్నారు. ఈ హ్యాంగోవర్ లీవ్ తమకు చాలా బాగా ఉపయోగపడుతోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

హ్యాంగోవర్ లీవ్ గురించి ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఈ సదుపాయం వల్ల ఆందోళన ఎక్కువ అయినప్పుడల్లా కాస్త మద్యం సేవించి.. ఆపై హ్యాంగోవర్ లీవ్ సెలవు తీసుకుని నిద్రపోతున్నామన్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చాక మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఉద్యోగులకు అత్యధిక వేతనం ఇవ్వలేకే ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతుండగా.. ఈ పథకం భారత్ తీసుకువస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+