వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రెయిన్ బూట్లపై మంత్రి జోక్ ఇలా... మంత్రి పదవికి దూరమిలా....

జపాన్ కు చెందిన సహయ మంత్రి చేసిన పేల్చిన జోక్ ఆయన మంత్రి పదవికి దూరం చేసింది. గత ఏడాది టైపూన్ సందర్భంగా తాను రెయిన్ బూట్లు వేసుకోలేదన్నారు.అయితే ప్రభుత్వం అప్పు చేసి మరీ అధికారులకు రెయిన్ బూట్లు కొనుగ

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోక్యో:ఓ జోక్ మంత్రి పదవిని ఊడేలా చేసింది. విపక్షాలతో పాటు స్వపక్షం నుండి తీవ్రంగా విమర్శలు ఎదురుకావడంతో మంత్రివర్గం నుండి తప్పుకొన్నారు జాపాన్ కు చెందిన మంత్రి .నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

గత ఏడాది జపాన్ లో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు జపాన్ సహయ మంత్రి షున్ సుకే ముతాయి ఇవాతె ప్రావిన్స్ రాష్ట్రంలో పర్యటించాడు.అయితే బురద కాలువను దాటేందుకుగాను ఆయన ఓ వ్యక్తిపై కూర్చుని బురద కాలువను దాటాడు.అయితే ఈ విషయమై ఆనాడే జపాన్ లో విమర్శలు చేలరేగాయి. అయితే దీనిపై మంత్రి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Japanese junior minister resigns after making inappropriate remark over piggyback ride

అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జపాన్ సహయ మంత్రి షున్ సుకే ముతాయి ఓ జోక్ చేసి మరో వివాదానికి కారణమయ్యారు. ఈ జోకే ఆయనను మంత్రివర్గం నుండి రాజీనామా చేసేలా చేసింది.

గత ఏడాది టైపూన్ దాటికి 19 మంది మరణించారు.అయితే బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన షున్ సుకే ముతాయ్ ఓ వ్యక్తి పై కూర్చొని బురద కాలువను దాటడమే వివాదాస్పదమైంది.అయితే రెయిన్ బూట్లు వేసుకొని కారణంగానే తాను మరో వ్యక్తిపై కూర్చోని బురద కాలువను దాటాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ముతాయ్ ఇటీవల టోక్యోలో జరిగిన కార్యక్రమంలో గత ఏడాది టైపూన్ వరదల ఘటనలో తాను వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ పేల్చిన జోక్ తన మంత్రి పదవి ఊడేలా చేసింది.

గత ఏడాది తాను అలా చేయడం వల్ల బూట్ల పరిశ్రమకు లాభం చేకూరిందన్నారు. అధికారుల కోసం ప్రభుత్వం అప్పు చేసి మరీ రెయిన్ బూట్లను కొనుగోలు చేసిందని జోక్ చేశాడు. ముతాయ్ జోక్ పై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేశాయి. స్వపక్షంలో కూడ ఇదే తరహ విమర్శలు రావడంతో డిజాస్టర్ మేజేజ్ మెంట్ మంత్రి జాన్ మట్స్ మటో కూడ ముతాయ్పై తీవ్రంగా స్పందించారు. దీంతో ముతాయ్ తన పదవికి రాజీనామా చేశారు.

English summary
A Japanese junior minister, who was criticised last year for getting a piggyback ride across a large puddle in a typhoon-hit town, resigned on Thursday (March 9).This came after Mr Shunsuke Mutai, who was parliamentary vice-minister for reconstruction, again drew flak after he made inappropriate remarks concerning his gaffe one day earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X