కొకైన్ కింగ్: జైల్లో లెగ్జరీ లైఫ్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

పరాగ్వే: నేరం చేశాడని అతన్ని జైల్లో పెట్టారు. అయితే జైలు సిబ్బంది సహకారంతో అతను మూడు గదులను 5 స్టార్ హోటల్ గా మార్చేశాడు. జైళ్ల శాఖ అధికారులు సెంట్రల్ జైలు చేరుకుని పరిశీలించి విషయం తెలుసుకుని ముక్కున వేలు వేసుకున్నారు.

అధికారులు ఆశ్చర్యపోయే విధంగా అతను తనకు కేటాయించిన జైలు సెల్ ను మార్చేశాడు. బ్రెజిల్ కు చెందిన జార్విన్ చిమెన్స్ పవావో పెద్ద డ్రగ్స్ వ్యాపారి. ఇతను అనేక దేశాల్లో డ్రగ్స్ వ్యాపారం విస్తరించాడు.

ఇతనికి కొకైన్ కింగ్ అనే పేరుంది. అత్యంత సంపన్నుల్లో స్థానం సంపాదించాడు. 8 సంవత్సరాల క్రితం ఇతన్ని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో పరాగ్వే రాజధాని అసిన్సిన్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇతనికి మూడు గదులు (సెల్ ) కేటాయించారు. అంతే జైలు సెల్ రూపురేఖలు మార్చేశాడు. మూడు గదులు హైటెక్ హంగులతో పలు సదుపాయాలు ఉండేలా చేశాడు. హైటెక్ కిచెన్, ప్లాస్మా టీవీ, సెమినార్ రూం, కంప్యూటర్, గ్రంధాలం ఏర్పాటు చేసుకున్నాడు.

ఇటీవల అధికారులు సోదాలు చేయడంతో ఇతని బండారం బయటపడింది. జైలు సిబ్బందిని లంచంతో కొని తన సెల్ ను ఇలా మార్చుకున్నాడని వెలుగు చూసింది. అయితే జార్వీన్ జైల్లో ఉండటం వలన మాకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఖైదీలు చెబుతున్నారు.

జార్వీన్ 2017లో జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ సమయంలో ఇతని బండారం బయటపడటంతో అధికారులు కంగుతిన్నారు. అతన్ని వేరే సెల్ కు పంపించారు. ఇప్పుడు మీడియాలో కొకైన్ కింగ్ జార్వీన్ హాట్ టాపిక్ గా నిలిచాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Brazilian drug lord Jarvis Chimenes Pavao, has turned his jail cell in Tacumbu prison into a luxury suite. Sentenced to life in luxury.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి