షాక్: భూమ్మీద నూకలున్నాయి, ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: కొన్ని ప్రమాద ఘటనలను చూస్తే ఈ ప్రమాదంలో ఉన్నవారు ఎవరూ బతికి బతకట్టారని అనుకొంటాం. కాని, ఈ తరహా ప్రమాదంలో ఓ వ్యక్తి సురక్షితంగా బయపడ్డాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా తిలకించినవారు మాత్రం ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.

అమెరికాలోని అలబామాలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.ఈ నెల 25వ, తేదిన ఈ ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారైనా, వీడియో చూసిన వారైనా ఈ ప్రమాదంలో ఉన్నవారు బతికి బయటపడడం అసాధ్యమంటారు.

accident

అమెరికాలోని అలబామాలో ఈ నెల 25వ, తేదిన ఓ రోడ్డు ప్రమాదం సంబవించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గంలో ఓ వ్యక్తి తన జీపులో అతివేగంతో వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తాడు.

అలా అంతే వేగంతో వెళ్తుండగా జీపు అదుపుతప్పి పల్టీలు కొడుతూ తనముందు వెళ్తున్న ఎరుపురంగు కారును ఢీకొట్టింది. ఆ సమయంలోనే అక్కడో విచిత్రమైన ఘటన చోటుచేసుకొంది.

వేగంగా పల్టీలు కొడుతున్న జీపు నుండి డ్రైవర్ బయటకు దూకాడు. మళ్ళీ లేచిన వెంటనే నడుచుకొంటూ ధ్వంసమైన తన జీపు వద్దకు వెళ్లాడు. ఈ ప్రమాద సమయంలో ఆ వాహనంలో ఉన్నవారు ఎవరూ కూడ బతికి బట్టకట్టరని భావిస్తారు. కాని, అందుకు భిన్నంగా జరిగింది. జీపు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులోని వారు కూడ గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనను వెనుక నుండి వస్తున్న ఏజే కెవిన్ అనే వ్యక్తి కారు డాష్ కెమెరాలో నమోదైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dramatic video shows the moment an ejected driver walked away from a car wreck in Alabama after his Jeep flipped several times.
Please Wait while comments are loading...