నగ్న ఫోటోల లీకేజీ : ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడిపై పరువు నష్టం దావా..
Recommended Video
ప్రపంచ కుబేరుడు,అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సమస్యల్లో చిక్కుకున్నారు. జెఫ్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైఖెల్ శాంచెజ్ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ది నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రికకు జెఫ్ వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసినట్టు తనపై ఆయన చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ పరువు నష్టం దావా వేశారు. ది నేషనల్ ఎంక్వైరర్ లీక్ చేసిన ఫోటోల్లో లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలతో పాటు జెఫ్ బెజోస్‌తో ఆమె శృంగారంలో పాల్గొన్న ఫోటోలు కూడా ఉన్నాయి.

అసలేం జరిగింది..
జనవరి,2019లో ది నేషనల్ ఎంక్వైరర్ లారెన్ శాంచెజ్,జెఫ్ బెజోస్ వ్యక్తిగత ఫోటోలను బయటపెట్టింది. అంతేకాదు,వారి వ్యక్తిగత సంభాషణకు సంబంధించిన పలు మెసేజ్‌లను కూడా బయటపెట్టింది. అయితే ఈ లీకేజీ వెనకాల లారెన్ శాంచెజ్ సోదరుడు మైకెల్ ఉన్నాడని బెజోస్ ఆరోపించారు. బెజోస్ చేసిన ఈ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని మైకెల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు ఎఫ్‌బీఐ అధికారులు తన ఇంటిపై దాడులు చేయడంతో చుట్టుపక్కలవారి ముందు అవమానించబడ్డానని అన్నాడు.

ఖండించిన మైకెల్ సోదరి..
తన సోదరి లారెన్ శాంచెజ్‌కు తాను విధేయుడైన సోదరుడిగా,మేనేజర్‌గా వ్యవహరించానని మైకెలో పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు లారెన్ శాంచెజ్ తన సోదరుడి పిటిషన్‌పై స్పందిస్తూ.. అతనివి నిరాధార,నిజం లేని ఆరోపణలు అని పేర్కొంది. జెఫ్ బెజోస్ మాత్రం ఇప్పటికైతే మైకెల్ పిటిషన్‌పై స్పందించలేదు.

గతంలో వాల్ స్ట్రీట్ కథనం
లారెన్ శాంచెజ్,బెజోస్ ఫోటోల లీకేజీపైగతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. అందులో లారెన్ శాంచెజ్ సెల్‌ఫోన్ నుంచే మైకెల్‌కు ఫోటోలు,మెసేజ్‌లు వెళ్లినట్టు పేర్కొంది. బెజోస్‌కు,తనకు మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలను ఆమె మైకెల్‌కు పంపించినట్టుగా చెప్పింది. ఈ సమాచారాన్ని మైఖెల్ 2లక్షల డాలర్లకు ది నేషనల్ ఎంక్వైరర్‌కు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి.

లారెన్‌తో వ్యవహారం బయటపడటంతో..
మరోవైపు బెజోస్ ఫోన్‌ను సౌదీ ప్రభుత్వం హ్యాక్ చేసిందన్న కథనాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సౌదీ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. ఇదే క్రమంలో బెజోస్ భార్య మెకంజీ తీవ్ర మనస్తాపానికి గురై ఆయనకు విడాకులు కూడా ఇచ్చారు. లారెన్ శాంచెజ్‌తో సంబంధం బయటపడటంతో ఆమె షాక్‌కి గురయ్యారు. ఇదిలా ఉంటే,బెజోస్ శాంచెజ్‌లు ఇటీవల భారత పర్యటనకు వచ్చి తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications