Delta Variant : జాన్సన్ అండ్ జాన్సన్‌ వ్యాక్సిన్‌తో చెక్-8 నెలల పాటు వైరస్ నుంచి రక్షణ...

ఇప్పటికే దాదాపు 100 దేశాల్లో విస్తరించిన డెల్టా వేరియంట్‌తో మున్ముందు మరో ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ఈ వేరియంటే కారణమన్న వాదన ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై ఎంతమేర ప్రభావం చూపగలవన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తే డెల్టా వేరియంట్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆ దిశగా పరిశోధనలు జరుగుతుండగా... తాజాగా అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కీలక ప్రకటన చేసింది.

డెల్టా వేరియంట్‌తో పాటు మిగతా వేరియంట్లపై...

డెల్టా వేరియంట్‌తో పాటు మిగతా వేరియంట్లపై...

జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ డెల్టా వేరియంట్‌పై అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. సుమారు 8 నెలల పాటు ఇది వైరస్ నుంచి రక్షణ కల్పించగలదని తెలిపింది. కేవలం డెల్టా వేరియంట్‌పై మాత్రమే కాదు... మిగతా అన్ని వేరియంట్లపై ఇది ప్రభావవంతంగా పనిచేయగలదని తెలిపింది. శరీరంలో బలమైన న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా 8 నెలల వరకు ఈ వ్యాక్సిన్ అన్ని రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పించగలదని చెబుతున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న 29 రోజుల్లో...

వ్యాక్సిన్ తీసుకున్న 29 రోజుల్లో...

ఇప్పటికే ఫైజర్,మోడెర్నా కంపెనీలు తాము అభివృద్ది చేసిన వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న 29 రోజుల్లో అది డెల్టా వేరియంట్‌ను తటస్థీకరిస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై జాన్సన్ వ్యాక్సిన్ పనితీరును పరిశీలించేందుకు రెండు వేర్వేరు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

క్లినికల్ ట్రయల్స్...

క్లినికల్ ట్రయల్స్...

క్లినికల్ ట్రయల్‌లో జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నవారిలో... డెల్టా వేరియంట్‌ బారినపడ్డాక వారి రక్తంలో సంభవించే పరిణామాలను అధ్యయనం చేశారు. డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను,రోగ నిరోధకతను ఉత్పత్తి చేయడంలో వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరో క్లినికల్ ట్రయల్‌లో ఇజ్రాయెల్‌లోని డీకోనెస్ మెడికల్ సెంటర్‌లో 20 మంది పేషెంట్లపై పరిశోధనలు జరిపారు. డెల్టా వేరియంట్ నుంచి 8 నెలల పాటు రక్షణ కల్పించడంలో ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికైతే ఈ వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులో లేదు. బహుశా వచ్చే నెల నాటికి భారత్‌లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన...

డెల్టా వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన...

డెల్టా వేరియంట్ ఒరిజినల్ వేరియంట్ కంటే రెండున్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయంగా దీన్ని ఆందోళనకారక వైరస్‌గా గుర్తించింది. రాబోయే కొద్ది వారాల్లో అమెరికాలో ఇది డామినెంట్‌గా మారే అవకాశం ఉన్నట్లు అక్కడి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేస్తోంది.ప్రస్తుతం యూకెలో నమోదవుతున్న కేసుల్లోనూ డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంటే కారణమని పలు పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లోనే దేశంలో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో డెల్టా వేరియంట్ మళ్లీ విరుచుకుపడుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+