వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతినుద్దేశించి బిడెన్ ప్రసంగం..? విజేతగా ప్రకటించిన తర్వాతే.. విజయానికి అడుగుదూరంలో

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు కొలిక్కి వస్తోన్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితం తేలే అవరాశం ఉంది. ట్రంప్‌పై బిడెన్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్టు తెలుస్తోంది. దీనిని అక్కడి అధికారులు ప్రకటించాల్సి ఉంది. పెన్సిల్వేనియా, జార్జియాలో బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అమెరికాలో 538 ఎలక్టొరల్ ఓట్లు ఉండగా.. అధికారం చేపట్టేందుకు 270 సీట్లు కావాలి. బిడెన్ 264 స్థానాలతో లీడ్‌లో కొనసాగుతున్నారు. దీనికి తోడు జార్జియా, పెన్సిల్వేనియాలో కూడా ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ మాత్రం 214 సీట్లతో ఉన్నారు.

 Joe Biden close to White House victory as he builds leads in Pennsylvania

జార్జియా, ఆరిజొనా, నెవాడలో కూడా బిడెన్ హవా కొనసాగుతోంది. ఆధిక్యంలో కొనసాగుతోన్నందున అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ ప్రసంగించే అవకాశం ఉంది. అదీ విజయానికి సంబంధించిన సందేశం కానున్నది. మరికొన్ని గంటల్లో విజేతను ప్రకటిస్తారని బిడెన్ సన్నిహితులు చెబుతున్నారు. పెన్సిల్వేనియో, జార్జియాతోపాటు ఫిలడెల్పియా, అట్లాంటాలో కూడా బిడెన్ లీడ్‌లో కొనసాగుతున్నారు.

అయితే ఫిలడెల్పియాలో ట్రంప్ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఎల్లో రంగు టీ షర్ట్ వేసుకొని.. ప్రతీ ఓటు కౌంట్ చేయాలని కోరుతున్నారు. మరికొందరు నినాదాలు చేస్తున్నారు.

English summary
Democrat Joe Biden expanded his narrow leads over President Donald Trump in the battleground states of Pennsylvania and Georgia on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X