వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బిడెన్ చర్యలు అనూహ్యం: కొలంబియా జడ్జిగా రూపా పుట్టగుంట నామినేట్: పాకిస్తానీ సహా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలు యూఎస్ ఫెడరల్ జడ్జ్‌షిప్ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్నారు. కొత్తగా ఫెడరల్ న్యాయస్థానాలకు ఆయన 11 మంది న్యాయమూర్తులను నామినేట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫూటించింది. ఆ 11 మందిలో ఓ ముస్లిం సహా నల్ల జాతీయులు, ఆసియన్ అమెరికన్లు ఉన్నారు. ఓ ముస్లింను ఫెడరల్ జడ్జ్‌షిప్‌కు ఎంపిక చేయడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఆ ముస్లిం కూడా పాకిస్తానీ మూలాలు ఉన్న వ్యక్తి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో రూపా పుట్టగుంటను కొలంబియా జడ్జ్‌గా నామినేట్ చేశారు.

మగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభంమగవారికి మాత్రమే: జో బిడెన్ సంచలన ప్రకటన: ఏప్రిల్ 19 నుంచి ఆరంభం

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యుట్ కోర్టు న్యాయమూర్తిగా కేతన్‌జీ బ్రౌన్ జాక్సన్‌ను నామినేట్ చేశారు. ఆఫ్రికన్-అమెరికన్ మహిళ కేతన్‌జీ జాక్సన్. మెరిక్ గార్‌లాండ్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద ఫెడరల్ సర్క్యూట న్యాయమూర్తిగా టిప్పానీ కన్నింగ్‌హామ్, 7వ యూఎస్ సర్క్యూట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా క్యాండీస్ జాక్సన్-అకివుమి అపాయింట్ అయ్యారు. ఆమె కూడా నల్లజాతీయురాలే. మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులగా డెబోరా బోర్డ్‌మన్‌, లిడియా గ్రిగ్స్‌బై నియమితులయ్యారు. న్యూజెర్సీ, కొలంబియా జిల్లా కోర్టు న్యాయమూర్తులుగా జులియన్ నీల్స్, ఫ్లోరెన్స్ వై పాన్ అపాయింట్ అయ్యారు.

Joe Biden nominated Black women, Asian American and the first Muslim to federal judgeships

న్యూజెర్సీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా జహీద్ ఎన్ ఖురేషీ నియమితులయ్యారు. ఆయన పూర్వీకులు పాకిస్తాన్‌కు చెందిన వారు. పాకిస్తాన్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం ఆయనది. ఓ ముస్లిం న్యాయమూర్తిని ఫెడరల్ జడ్జ్‌షిప్‌లోకి తీసుకోవడం ఇదే తొలిసారి. కొలరాడో, న్యూ మెక్సికో జిల్లా కోర్టులకు రెజీనా రోడ్రిగ్జ్, మార్గరెట్ స్ట్రిక్‌లాండ్‌లను నియమించారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తిగా జడ్జ్ రూపారంగ పుట్టగుంటను నియమించారు. తెలుగు మూలాలు ఉన్న మహిళగా భావిస్తున్నారు. ఇదివరకు రూపా పుట్టగుంట డీసీ రెంటల్ హౌసింగ్ కమిషనర్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్‌గా పనిచేశారు. 2013 నుంచి 2019 వరకు క్రిమినల్ డిఫెండెంట్స్ న్యాయవాదిగా పనిచేశారు.

English summary
President Joe Biden nominated several Black women, an Asian American and the first Muslim ever to federal judgeships Tuesday in a push for diversity in the US court system. Biden unveiled his first 11 picks for judges, with only two of them men, neither of them white.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X