వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జియా సహా కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ జోరు: వైట్‌హౌస్‌కు రూట్ క్లియర్, ట్రంప్ కలలు కల్లల్లేనా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో ఆధిక్యతను చాటిన జో బైడెన్.. అధ్యక్ష రేసులో ముందున్నారు.

 కీలక స్పీచ్: జో బైడెన్‌కు భద్రత పెంచుతున్న అమెరికా సీక్రెట్ సర్వీస్ కీలక స్పీచ్: జో బైడెన్‌కు భద్రత పెంచుతున్న అమెరికా సీక్రెట్ సర్వీస్

జార్జియాలోనూ బైడెన్ జోరు

జార్జియాలోనూ బైడెన్ జోరు

అత్యంత కీలకమైన జార్జియా రాష్ట్రంలోనూ ప్రస్తుతం జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ట్రంప్ ఈ రాష్ట్రంలో ఆధిక్యతను చూపగా.. తాజాగా, జో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. జార్జియాలోనూ బైడెన్ ఆధిక్యతను చూపుతుండటంతో ఇక ఆయనకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది.

జో బైడెన్ గెలిస్తే..

జో బైడెన్ గెలిస్తే..

రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న జార్జియా.. ఇప్పుడు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు మొగ్గుచూపింది. ప్రస్తుతం బైడెన్ 917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. బైడెన్ గెలిస్తే ఈ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. దీంతో జో బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా అవతరించనున్నారు.

అధ్యక్ష భవనానికి ట్రంప్ దూరమేనా?

అధ్యక్ష భవనానికి ట్రంప్ దూరమేనా?

కాగా, జార్జియాలో ఓడిపోయి మిగితా నాలుగు రాష్ట్రాల్లో గెలిచినా ట్రంప్ మేజిక్ ఫిగర్‌ను అందుకోలేరు. దీంతో ట్రంప్ అధ్యక్ష పదవికి దూరమైనట్లేనని కనిపిస్తోంది. కాగా, జార్జియాలో బైడెన్ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. ఇక చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రాటిక్ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు.

రూట్ క్లియర్.. అధ్యక్ష భవనానికి జో బైడెన్..

రూట్ క్లియర్.. అధ్యక్ష భవనానికి జో బైడెన్..

మరోవైపు అలస్కా, నార్త్ కరోలినాలో మాత్రమే డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. పెన్సిల్వేనియా, అలస్కాలో కూడా జో బైడెన్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. నెవడాలో మాత్రం బైడెన్ ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. జార్జియా, నెవడా డెమొక్రాట్లు గెలిస్తే.. అధ్యక్ష భవనంలో జో బైడెన్ అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైనట్లే. రెండోసారి అధ్యక్షుడిని కావాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ కలలు కల్లలైనట్లే.

English summary
Democratic nominee Joe Biden edged ahead of President Donald Trump in the all-important battleground of Pennsylvania for the first time Friday, adding to a sense of inevitability that the Scranton native would reach the 270 electoral votes he needs to capture the presidency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X