వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బరిలో దిగిన బైడెన్: యూరప్‌ పర్యటన ఖరారు: నాటో, ఈయూ దేశాలకు దిశానిర్దేశం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రోజులు గడుస్తున్న కొద్దీ- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెర పడట్లేదు. యుద్ధాన్ని నిలిపివేయడానికి రెండు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటోన్నప్పటికీ.. అవి కొలిక్కి రావట్లేదు. డిమాండ్లను అంగీకరించే విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. అది కాస్తా యుద్ధం కొనసాగింపునకు దారి తీస్తోంది. ఉక్రెయిన్‌లోని దాదాపు అన్ని రీజియన్లపైనా రష్యా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నట్టే కనిపిస్తోంది. రాజధాని కీవ్ మాత్రం ప్రతిఘటిస్తోంది.

లీగల్ గ్యారంటీ..

లీగల్ గ్యారంటీ..

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో తాము చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. నిజానికి- రష్యా ప్రధాన డిమాండ్ కూడా ఇదే. ఈ ఒక్క డిమాండ్‌కు అంగీకరిస్తే రష్యా యుద్ధాన్ని నిలిపివేస్తుందని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. నాటోలో చేరబోమంటూ జెలెన్‌స్కీ నోటిమాటగా చెప్పడాన్ని అంగీకరించట్లేదు. దీనికి లీగల్ గ్యారంటీ కావాలని పట్టుబడుతోంది.

ఆ రెండు రీజియన్లపైనా

ఆ రెండు రీజియన్లపైనా

డొనాట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను ఇండిపెండెంట్స్ స్టేట్స్‌గా గుర్తించాలనీ రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ రెండు రీజియన్లు కూడా 2014 నుంచి రష్యన్ వేర్పాటువాదుల ఆధీనంలో ఉంటోన్నాయి. ఈ రెండు రీజియన్లపై ఉక్రెయిన్ ప్రభుత్వం తన అధికారాన్ని వెనక్కి తీసుకోవాలని రష్యా పట్టుబడుతోంది. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఈ రెండు రీజియన్లను ఇండిపెండెంట్ స్టేట్స్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రంగంలో దిగిన బైడెన్..

రంగంలో దిగిన బైడెన్..

నాటోలో చేరబోమంటూ జెలెన్‌స్కీ నుంచి ప్రకటన వెలువడిన తరువాత అమెరికా అప్రమత్తం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకోనున్నారు. దీనికోసం ఆయన యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు కీలకమైన, అత్యున్నత స్థాయి సదస్సులకు ఆయన హాజరు కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న వేళ.. బైడెన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు.

 24న బ్రస్సెల్స్‌లో..

24న బ్రస్సెల్స్‌లో..


ఈ నెల 24వ తేదీన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పాటు కానున్న నాటో అత్యున్నత స్థాయి సదస్సుకు బైడెన్ హాజరు కానున్నారు. అలాగే- యూరోపియన్ యూనియన్ నేతలతో ముఖాముఖి భేటీ కానున్నారు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల సమావేశంలో బైడెన్ పాల్గొననున్నారు. బైడెన్ పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ పిసాకీ తెలిపారు. నాటో నిర్వహించబోయే అసాధారణ సదస్సుగా దీన్ని ఆమె అభివర్ణించారు.

కీలకమైన సదస్సులు..

కీలకమైన సదస్సులు..


దీనితోపాటు యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు నిర్వహించే సదస్సులోనూ బైడెన్ పాల్గొంటారని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు సదస్సులు- అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నామని పిసాకీ వ్యాఖ్యానించారు. రష్యాపై విధించాల్సిన మరిన్ని ఆంక్షలు, యుద్ధంలో నష్టపోతున్న ప్రజలకు మానవతా దృక్పథం కింద అందించాల్సిన సహాయ, సహకారాలు, ఉక్రెయిన్ భవిష్యత్ గురించి ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

English summary
Biden will meet NATO and European leaders at a summit in Brussels on March 24. He will also attend a scheduled European Union summit the same day for discussions on further sanctions on Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X