• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాన్ మెకాఫీ: తొలి యాంటీ-వైరస్ సృష్టికర్త స్పెయిన్ జైలులో అనుమానాస్పద మృతి - Newsreel

By BBC News తెలుగు
|

జాన్ మెకాఫీ

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మెకాఫీ బార్సెలోనా జైలు గదిలో మృతి చెందారు. పన్ను ఎగవేత అభియోగాలు ఎదుర్కొంటున్న మెకాఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్‌లోని ఒక కోర్టు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు.

మెకాఫీని బతికించేందుకు జైలు వైద్యులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిందని కేటలాన్ న్యాయ విభాగం తెలిపింది.

మెకాఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు "ఆధారాలు సూచిస్తున్నాయని" ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రపంచానికి తొలి కమర్షియల్ యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అందించిన సంస్థ మెకాఫీ.

మెకాఫీ తయారు చేసిన 'వైరస్‌స్కాన్' కంప్యూటర్ ప్రపంచంలో వందల కోట్ల యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ వ్యాపారానికి నాంది పలికింది. తరువాత దాన్ని టెక్ దిగ్గజం ఇంటెల్ 760 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

జాన్ మెకాఫీ 2020 అక్టోబర్‌లో స్పెయిన్ నుంచి టర్కీకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

కన్సల్టింగ్ వర్క్, ప్రసంగాలు, క్రిప్టోకరన్సీ, తన జీవిత కథ హక్కుల అమ్మకం ద్వారా కోట్లు సంపాదించినప్పటికీ నాలుగేళ్లుగా పన్నులు ఎగ్గొట్టారని ఆయనపై కేసు నమోదు చేశారు.

మెకాఫీ తన ఆదాయాన్ని నామినీల బ్యాంకు ఖాతాల్లోనూ, క్రిప్టోకరెన్సీ మార్పిడి ఖాతాల్లోనూ జమ చేయడం ద్వారా పన్ను ఎగవేసినట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపించింది.

వివిధ ఆస్తులు, ఓ విహార నౌక, రియల్ ఎస్టేట్ ఆస్తి మొత్తాన్ని దాచిపెట్టారని, ఇతరుల పేర్లపై రిజిస్టర్ చేశారని ఆరోపించారు.

ఈ కేసును విచారించే అధికారాన్ని స్పెయిన్ జాతీయ కోర్టు బుధవారం అమెరికాకు అప్పగించింది.

తనను వ్యూహాత్మకంగా కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని గత కొన్నేళ్లుగా మెకాఫీ ఆరోపిస్తూనే ఉన్నారు.

అయితే, అలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపినట్లు స్పానిష్ వార్తాపత్రిక ఈఎల్ పెయిస్ తెలిపింది.

టెక్నాలజీ ప్రపంచంలో మెకాఫీ వివాదాస్పద వ్యక్తిగా పేరు పొందారు

ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌లో జన్మించిన ఈ పారిశ్రామికవేత్త 1980లలో తన సొంత సాంకేతిక సంస్థను స్థాపించి, మెకాఫీ వైరస్‌స్కాన్‌ను కనిపెట్టనప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చారు.

అయితే, తన సొంత కంప్యూటర్లలో మెకాఫీగానీ, మరి ఏ ఇతర యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌గానీ వాడనని ఓసారి ఆయన బీబీసీకి తెలిపారు.

"ఐపీ అడ్రస్ ఎప్పటికప్పుడు మారుస్తూ, వైరస్ వస్తుందని అనుమానమొచ్చే సైట్ల జోలికి పోకుండా నన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను. ఉదాహరణకు పోర్న్ సైట్ల జోలికి ఎప్పుడూ పోను" అని 2013లో బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్ లియో కెలయన్‌కు మెకాఫీ తెలిపారు.

2019లో మెకాఫీ పన్నుల పట్ల వ్యతిరేక వ్యక్తం చేస్తూ, తాను ఎనిమిదేళ్లుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదని, ఎందుకంటే "పన్నులు విధించడం అక్రమం" అని ట్వీట్ చేశారు.

అదే ఏడాది, ఆయుధాలను దేశంలోకి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయనను డొమినిక్ రిపబ్లిక్‌లో కొన్నాళ్లు నిర్బంధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
John McAfee: Suspicious death of first anti-virus creator in Spanish prison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X