వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెజె పౌడర్‌తో క్యాన్సర్: ‘493కోట్ల పరిహారం ఇవ్వండి’

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఈ కంపెనీ తయారుచేసిన బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్‌లను కొన్ని దశాబ్దాల పాటు వాడిన ఓ మహిళ అండాశయ కేన్సర్‌(ఒవెరియన్ క్యాన్సర్)తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.

మిస్సౌరీ రాష్ట్ర జ్యూరీలోని 60 మంది సభ్యులుగల సెయింట్ లూయిస్ సర్క్యూట్ కోర్ట్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జాకీ ఫాక్స్(62) ఒవేరియన్ కాన్సర్‌తో 2013లో మరణించారు. దీంతో ఆమె కొడుకు మార్విన్ స్కాల్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

 Johnson & Johnson to pay $72m in case linking baby powder to ovarian cancer

జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ల టాల్కం పౌడర్‌ను దీర్ఘకాలం పాటు వాడడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. టాల్క్ బేస్‌డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించలేదని చెప్పారు. ఇదే అంశంపై మిస్సోరి కోర్టులో 1000కేసులు, న్యూజెర్సీ కోర్టులో మరో 200 కేసులు నమోదయ్యాయి.

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మోసం చేసిందని, నిర్లక్ష్యం వహించిందని, కుట్రపూరితంగా వ్యవహరించిందని జ్యూరీ తేల్చినట్లు ఫాక్స్ కుటుంబం తరపు న్యాయవాదులు తెలిపారు. తమ ఉత్పత్తులతో ఈ ప్రమాదం ఉందన్న విషయం ఆ కంపెనీకి 1980ల నుంచే తెలుసుని మరో న్యాయవాది ఆరోపించారు.

కాగా, కంపెనీ వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ తీర్పుతో కంపెనీ ప్రతినిధి కరోల్ బ్రిక్స్ విభేదించారు. బాధిత కుటుంబం పట్ల తమకు సానుభూతి ఉందని.. ఆమె క్యాన్సర్‌కు తమ ఉత్పత్తుతలకు సంబంధం లేదని, ఈ తీర్పును సవాల్ చేయనున్నామని స్పష్టం చేశారు.

English summary
A Missouri jury has awarded $72m to the family of a woman who died from ovarian cancer, which she said was caused by using Johnson & Johnson’s baby powder and other products containing talcum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X