వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటిపై రక్తం తేలేలా-జర్నలిస్టులకు నరకం చూపించిన తాలిబన్లు-ఎంత చిత్రహింసలకు గురిచేశారంటే...

|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు జర్నలిస్టులపై తమ ప్రతాపం చూపించారు. కాబూల్‌లో మహిళల నిరసన ప్రదర్శనలను కవర్ చేసినందుకు కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి... వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒళ్లంతా వాతలు తేలేలా చితకబాదారు. తాలిబన్ల చేతిలో చావు దెబ్బలు తిన్న ఆ జర్నలిస్టుల ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. తాలిబన్ ప్రభుత్వంలో అందరికీ రక్షణ ఉంటుందని,పత్రికా స్వేచ్చను గౌరవిస్తామని చెప్పిన తాలిబన్లు... ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. దీంతో తాలిబన్ల అరాచకాలు మున్ముందు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

ఆ ఇద్దరు జర్నలిస్టులను.. ఒంటిపై రక్తం తేలేలా...

తాలిబన్ల చేతిలో గాయపడ్డ జర్నలిస్టుల ఫోటోలను లాస్ ఏంజిల్స్ కరస్పాండెంట్ మార్కస్ యామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు జర్నలిస్టుల వీపు,తొడ భాగాల్లో రక్తం తేలేలా కొట్టిన గుర్తులు కనిపిస్తున్నాయి. జకీ దర్యాబి అనే మరో జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోల్లో... గాయపడ్డ ఇద్దరు జర్నలిస్టులను ఆస్పత్రికి తరలించడం గమనించవచ్చు. ఆ ఇద్దరు జర్నలిస్టుల పేర్లు నెమత్ నక్దీ(28),తఖీ దర్యాబీ(22)లుగా లాస్ ఏంజిల్స్ మీడియా వెల్లడించింది. నక్దీ వీడియో జర్నలిస్ట్ కాగా దర్యాబీ వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కాబూల్‌లో మహిళల నిరసన ప్రదర్శనలు కవర్ చేస్తున్న వేళ ఇద్దరినీ తాలిబన్లు అరెస్ట్ చేశారు.

తలలపై కాళ్లు పెట్టి తొక్కారు....

తాలిబన్ల చెర నుంచి విడుదలయ్యాక జర్నలిస్ట్ దర్యాబీ వారు పెట్టిన చిత్రహింసల గురించి వెల్లడించాడు. తనను నేలపై పడేసి కొట్టారని.. చిత్రహింసలకు గురిచేశారని తెలిపాడు. దాంతో తాను స్పృహ కోల్పోయానని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి నక్దీని తీసుకొచ్చి అతన్ని కూడా చావబాదారని వాపోయాడు.'మేం జర్నలిస్టులమని అరుస్తూనే ఉన్నాం.కానీ వాళ్లు పట్టించుకోలేదు. మా తలలపై కాళ్లు పెట్టి తొక్కారు. ఇష్టమొచ్చినట్లు తన్నారు. ఇక వాళ్లు మమ్మల్ని చంపేయాలని నిర్ణయించుకున్నారని అనుకున్నాం. మహిళలను వీడియో తీశారా అని ప్రశ్నిస్తూ... మమ్మల్ని కొడుతూనే ఉన్నారు.' అని నక్దీ ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్ది గంటల తర్వాత తాలిబన్లు తమను విడుదల చేశారని... కానీ బయటకు నడిచేందుకు కూడా తమకు సత్తువ లేకుండా పోయిందని అన్నారు. తాలిబన్లు ఏమాత్రం మారలేదని... ఆఫ్గనిస్తాన్‌లో భద్రత అనేదే లేదని అన్నారు. వీలైతే దేశాన్ని వీడే యోచనలో తాను ఉన్నట్లు నక్దీ తెలిపారు.

కొందరు జర్నలిస్టులకు హాని తలపెట్టలేదు..

కొందరు జర్నలిస్టులకు హాని తలపెట్టలేదు..

కాబూల్‌లో మహిళల నిరసన ప్రదర్శనలు కవర్ చేస్తున్న సమయంలో... మహిళలను వీడియో తీయొద్దని మొదట తాలిబన్లు ఆ జర్నలిస్టులను హెచ్చరించారు. ఆపై ఇద్దరినీ అరెస్ట్ చేసి చితకబాదారు. అంతేకాదు,ఇంకా మీ తలలు నరికేయలేదు... మీరు అదృష్టవంతులని తాలిబన్లు కామెంట్ చేశారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తాలిబన్లు... వారిలో కొంతమందికి ఎలాంటి హానీ తలపెట్టకుండానే విడుదల చేయడం గమనార్హం. ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించాక ఏర్పాటు చేసిన మొదటి ప్రెస్ మీట్‌లోనే తాలిబన్లు మీడియాపై తమ వైఖరిని స్పష్టం చేశారు. మీడియా సంస్థలకు స్వేచ్చ ఉంటుందని... అయితే ఇస్లామిక్ చట్టాలకు లోబడే ఉంటుందని చెప్పారు.

మహిళల ప్రాతినిధ్యం కోసం డిమాండ్...

మహిళల ప్రాతినిధ్యం కోసం డిమాండ్...

33 మంది మంత్రులతో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉగ్రవాద నేపథ్యం ఉన్న తాలిబన్లు,హక్కానీ నెట్‌వర్క్‌కి చెందిన నేతలకు తప్ప ఇంకెవరికీ స్థానం కల్పించలేదు. అన్ని వర్గాలు,గ్రూపులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంటుందని ప్రకటించిన తాలిబన్లు ఆ మాట నిలుపుకోలేదు. ముఖ్యంగా ఒక్క మహిళను కూడా ప్రభుత్వంలోకి తీసుకోకపోవడంపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ధోరణిని నిరసిస్తూ పదుల సంఖ్యలో ఆఫ్గన్ మహిళలు కాబూల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేశారు. నిజానికి తాలిబన్ల పాలనలో మహిళలు రోడ్డెక్కడమంటే సాహసమనే చెప్పాలి. కానీ హక్కులు లేని జీవితం కంటే ప్రాణాలకు తెగించి తాలిబన్లపై తిరగబడటమే సరైందని అక్కడి మహిళలు భావిస్తున్నారు. అయితే తాలిబన్లు మాత్రం మహిళల ప్రాతినిధ్యాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు.

Recommended Video

Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu
మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన

మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన

మహిళలకు షరియా చట్టాలకు లోబడే హక్కులు ఉంటాయని తాలిబన్లు మొదట్లోనే ప్రకటించారు. ఆ చట్టాల ప్రకారం స్త్రీలకు విద్య,ఉద్యోగం నిషేధం. అయితే ఆ రెండింటికీ వెసులుబాటు కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల హస్తగతం కాగానే ఉద్యోగస్తులైన మహిళలందరినీ కార్యాలయాల నుంచి వెళ్లగొట్టారు. మళ్లీ ఆఫీసులకు వెళ్లవద్దని... వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఓ మహిళా జర్నలిస్టు తాలిబన్లను ఇంటర్వ్యూ చేస్తూ... మహిళలు ఎన్నికల్లో నిలబడితే ప్రజలను ఓటు వేయనిస్తారా అని ప్రశ్నించగా... ఆ మాటకు తలదించుకుని నవ్విన తాలిబన్లు కెమెరా ఆఫ్ చేయమంటూ ఆమెను బెదిరించారు. అదో జోక్‌లా వారు వ్యవహరించారు. ప్రస్తుత తాలిబన్ల వైఖరి చూస్తుంటే... మహిళలకు వారు రాజకీయాల్లో అవకాశం కల్పించడం అసాధ్యమనే చెప్పాలి.మరోవైపు ఇంటింటికీ తిరుగుతూ 15 ఏళ్లు పైబడ్డ బాలికల కోసం గాలిస్తున్నారు.బలవంతంగా వారిని పెళ్లిళ్లు చేసుకోవడం... మాట వినకపోతే హతమార్చడం చేస్తున్నారు. కొందరిని సెక్స్ బానిసలుగా మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే... తాలిబన్లు మొదట్లో పలికిన శాంతి వచనాలకు,వారి చేతలకు ఏమాత్రం పొంతన కుదరట్లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌లో మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
Los Angeles correspondent Marcus Yam shared photos of journalists wounded by the Taliban on Twitter. The photo shows blood stains on the backs and thighs of two journalists. In the video shared by another journalist named Jackie Daryabi ... you can see the two injured journalists being rushed to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X