భారత్‌కు మాకు చేసినట్లే... కోవిడ్ సాయానికి సిద్ధమన్న జో బైడెన్- ఇండో అమెరికన్ల హర్షం
కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. గతంలో భారత్ నుంచి కోవిడ్ మందులు తీసుకుని ఇప్పుడు సాయం చేసేందుకు వెనుకాడుతుందన్న విమర్శల్ని తిప్పికొడుతూ అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షుడురాలు కమలా హ్యారిస్ సైతం వేర్వేరు ప్రకటనల్లో భారత్‌కు అత్యవసర సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గతంలో భారత్ తమకు సాయం చేసినట్లే తాము కూడా ఇప్పుడు అవసరమైన సాయం అందిస్తామని జో బెడెన్ వెల్లడించారు.
Recommended Video
భారత్ సాయం గుర్తు చేసుకున్న బైడెన్
గతేడాది కరోనా సమయంలో బారత్ తమ దేశానికి చేసిన సాయం తరహాలోనే ఇప్పుడు భారత్‌కు తాము సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ట్వీట్‌లో తెలిపారు. కరోనా ఆరంభంలో తమ ఆస్పత్రులు ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ చేసిన చేసిన సాయం తరహాలోనే తాము కష్టాల్లో ఉన్న ఆ దేశాన్ని ఆదుకుంటామని బైడెన్ తన ట్వీట్‌లో వెల్లడించారు. తద్వారా భారత్ గతంలో అమెరికాకు చేసిన సాయాన్ని తాము మర్చిపోలేదని ఆయన గుర్తు చేసినట్లయింది. డెలావేర్‌లో వీకెండ్‌లో ఉన్నప్పటికీ బైడెన్ ఈ ట్వీట్ చేయడం విశేషం.
భారత్‌పై కమలా హ్యారిస్ ప్రశంసలు
భారత్‌కు కరోనా సామాగ్రి, ఇతర అవసరాలు తీర్చే విషయంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మరింత ఉదారంగా స్పందించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిస్దితుల దృష్ట్యా ఆ దేశంతో విస్తృతంగా కలిసి పనిచేస్తున్నట్లు హ్యారిస్ తెలిపారు. భారత్‌లో ప్రజల కోసం తాము ప్రార్ధిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. భారత్‌లోని ధైర్యవంతులైన ఆరోగ్య సిబ్బంది కోసం కూడా ప్రార్ధిస్తున్నట్లు కమలా హ్యారిస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అమెరికా అగ్రనాయకత్వం భారత్‌లో కరోనా పరిస్దితిపై తొలిసారి స్పందించినట్లయింది.

సొంత టీమ్ ఆగ్రహంతో స్పందన
గతేడాది అమెరికా ఎన్నికల్లో జో బైడెన్, కమలా హ్యారిస్‌తో కూడిన డెమోక్రాట్ టీమ్‌కు భారత్ ఎంతో అండగా నిలిచింది. ప్రతిగా బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు వంద మంది భారతీయులను తన టీమ్‌లోకి తీసుకున్నారు. ఇప్పుడు కష్టకాలంలో భారత్‌ను ఆదుకునే విషయంలో బైడెన్, హ్యారిస్ మౌనంపై సొంత టీమ్‌లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిస్దితిని గమనించిన బైడెన్, హ్యారిస్ వేర్వేరు ప్రకటనల్లో స్పందించడం ద్వారా భారత్‌కు తాము అండగా ఉంటామని ప్రకటించారు.

బైడెన్ ప్రకటనను స్వాగతించిన ఇండో-అమెరికన్లు
భారత్‌కు కరోనా సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు జో బైడెన్ చేసిన ప్రకటనను అమెరికాలోని ఇండో-అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. వీటిని గుడ్ ఫస్ట్ స్టెప్స్‌గా ఇండో-అమెరికన్ డెమోక్రాట్ శేఖర్ నరసింహన్ అబివర్ణించారు. కేవలం ఇండో-అమెరికన్లుగానే కాకుండా ప్రైవేట్‌గా కూడా భారత్‌కు అవసరమైన సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. కంగ్రెషనల్ ఇండియా కాకసస్ ఉపాధ్యక్షుడు రావు ఖన్నాతో పాటు తరణ్‌జీత్ సింగ్ వంటి వారు కూడా బైడెన్‌ను వేర్వేరు ప్రకటనల్లో స్వాగతించారు.












Click it and Unblock the Notifications