India-Canada : భారత్ కు మరిన్ని చిక్కులు ? మరింత రెచ్చిపోతున్న కెనడా పీఎం ట్రూడో..
ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్-కెనడా మధ్య రేగిన చిచ్చు నానాటికీ తీవ్రమవుతోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్దితి కొనసాగుతుండగా.. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలలకు సైతం భారతా కెనడానా తేల్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చేస్తోంది. అంతే కాదు ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కూడా మరింత ముదురుతోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అగ్రరాజ్యాల నుంచి లభిస్తున్న అండతో రెచ్చిపోతున్నారు.
ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. తాజాగా తన దాడిని మరింత తీవ్రవతరం చేశారు. దీనికి సంబంధించి విశ్వసనీయ ఆధారాలు కొన్ని వారాల క్రితమే భారత్ కు అందించినట్లు పేర్కొన్నారు. భారత్ తో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు భారత్ కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రూడో తాజాగా వెల్లడించారు.

ఇప్పటికే దౌత్యవేత్తల బహిష్కరణలు, తగ్గింపులు చేపడుతున్న ఇరుదేశాలూ తమ పౌరులకు హెచ్చరికలు కూడా జారీ చేశాయి.గతంలో కెనడా పౌరుల నేరాలకు సంబంధించి తాము ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని భారత్ ఆరోపిస్తోంది. మరోవైపు కెనడాతో సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిన్న భారత్‌కు పిలుపునిచ్చారు. తమ దేశం రెండు దేశాలతో టచ్‌లో ఉందని చెప్పారు. కానీ యూఎస్ తెరవెనుక భారత్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ తాము వెనక్కి తగ్గితే అంతర్జాతీయంగా ఇబ్బందులు తప్పవనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంత ఒత్తిడి వచ్చినా కెనడా ప్రధాని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. అలాగే కెనడా కూడా వెనక్కితగ్గకపోవడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. అదే కొనసాగితే కెనడాలో భారత పౌరులకు సమస్యలు తప్పవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications