సూసైడ్ బాంబు అటాక్: కాబుల్‌లో మారణహోమం, 95 మంది మృతి
కాబుల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్‌లో శనివారం తాలిబన్లు మారణ హోమం సృష్టించారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 95 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దాడిలో 150 మందికి పైగా గాయపడ్డారు.
అంబులెన్సులో భారీగా పేలుడు పదార్థాలు నింపి దానిని పేల్చేశారు. పేలుడు చోటు చేసుకోగానే ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పేలుడు తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు.

తాలిబన్ అనుబంధ సంస్థ హక్కానీ నెట్ వర్క్ పాత్ర ఉండవచ్చునని ఆఫ్గన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబుల్లో ఇటీవల చోటు చేసుకున్న అతిపెద్ద దాడి ఇది.
పేలుడు ధాటికి పలు భవంతులు, కార్యాలయాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు, రక్తమోడుతున్న క్షతగాత్రులతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణం కనిపించింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. సమీపంలోని భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఈ పేలుడు భారత్ ఎంబసీకి 400 మీటర్ల దూరంలో సంభవించింది. ఇక్కడ పలు అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.
అంబులెన్స్ డ్రైవర్ ఆసుపత్రికి రోగిని తీసుకు వెళ్తున్నట్లు నటిస్తూ మొదటి చెక్ పోస్టును దాటాడు. రెండో చెక్ పాయింట్ వద్ద పోలీసులు అంబులెన్సును ఆపేందుకు ప్రయత్నించగా వేరే దారికి మళ్లించాడు. పోలీసులు అంబులెన్సుకు అడ్డుపడటంతో పేలుడు పదార్థాలతో నిండిన ఆ వాహనాన్ని డ్రైవర్ పేల్చేశాడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications