Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధ్యక్ష రేసులోకి కమలా హారిస్.. ట్రంప్‌పై 'నియంత' బాంబ్!

Kamala Harris: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. శనివారం(అక్టోబర్ 26) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అమెరికాకు త్వరలో తొలి మహిళా అధ్యక్షురాలు నాయకత్వం వహిస్తారని.. బహుశా ఆ అవకాశం తనకే దక్కవచ్చని ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. తన రాజకీయ పోరాటం ఏ మాత్రం ఆగలేదని ఆమె స్పష్టం చేశారు.

2028 రేసులో ముందస్తు ప్రకటన
రాజకీయ నిర్ణయాల కోసం తాను సర్వేలు లేదా పోల్స్ ఫలితాలపై ఆధారపడనని కమలా హారిస్ వెల్లడించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంతో పరాజయం పాలైన ఆమె.. రాబోయే ఎన్నికల కోసం మూడు సంవత్సరాల ముందే సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందగా.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ 226 ఓట్లకే పరిమితమయ్యారు. మెజారిటీకి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. అమెరికన్ రాజ్యాంగ నియమం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 2028లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కమలా హారిస్ ముందస్తుగానే ఎన్నికల బరిలో ఉంటానంటూ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Kamala Harris Joins 2028 Presidential Race Slams Trump as Dictator

ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు
ఇదే ఇంటర్వ్యూలో కమలా హారిస్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఫెడరల్ ఏజెన్సీలు రాజకీయంగా పక్షపాతం వహిస్తూ, తమను విమర్శించేవారిని వేధించడం ప్రారంభించాయని ఆమె ఆరోపించారు. ట్రంప్ చాలా బలహీనమైన మనస్తత్వం కలవారని, జోక్‌గా చేసిన విమర్శలను కూడా సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఒక మీడియా సంస్థను మూసివేయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపించారు.అనేక మంది రాజకీయ నాయకులు కేవలం అధికారాన్ని అనుభవించడానికి లేదా చట్టపరమైన విచారణల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ అనే నియంత ముందు మోకరిల్లుతున్నారని హారిస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హారిస్ ఆరోపణలపై వైట్‌హౌస్ ప్రతిస్పందన
కమలా హారిస్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలకు వైట్‌హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ వెంటనే జవాబిచ్చారు.2024 ఎన్నికల ఫలితాల నుంచే అమెరికన్ ప్రజలు కమలా హారిస్ నిస్సారమైన అబద్ధాలను విశ్వసించరనే విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలని జాక్సన్ సూచించారు. అమెరికా ప్రజలు తనను నమ్మరనే విషయాన్ని కమలా గ్రహించడం వల్లే ఆమె తన ఫిర్యాదులను విదేశీ మీడియా సంస్థల ముందు ఉంచుతున్నారని జాక్సన్ ఎద్దేవా చేశారు. తమ రెండో పదవీకాలాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌కు 2028లో కూడా మద్దతుదారులు అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

మొత్తం మీద కమలా హారిస్ ముందస్తుగానే 2028 అధ్యక్ష ఎన్నికల బరిలో తాను ఉంటానని ప్రకటించడం ద్వారా, అమెరికన్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కడం ప్రారంభించాయని చెప్పవచ్చు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ నిలుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+