• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్

|

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ కొనసాగుతుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అమెరికా చరిత్రలోనే ఖరీదైనవిగానే కాకుండా అత్యధిక టర్నౌట్ నమోదయ్యే అవకాశమున్నవిగా 2020 ఎన్నికలు రికార్డుల్లో నిలిచాయి. దేశంలో మొత్తం 23కోట్ల,92లక్షల,47వేల182 మంది ఓటర్లు ఉండగా, అందులో సుమారు 1కోటి మంది శనివారం నాటికే ముందస్తుగా ఓట్లు వేశారు. ఈ సంఖ్య(1కోటి ముందస్తు ఓట్లు) గత ఎన్నికల టర్నౌట్ లో 50 శాతమని, తద్వారా 2020లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

సంప్రదాయ విధానాలు, పన్నుల సరళీకరణ, వలసదారుల నియంత్రణ వంటి అంశాలే ప్రధాన అజెండాగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న రిపబ్లికన్ పార్టీ.. ఆధునిక భావాలు, లెఫ్టిస్టు ఐడియాలజీ, వలసదారులకు మద్దతుగా నిలిచే డెమోక్రటిక్ పార్టీతో హోరాహోరీ తలపడుతున్నది. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎలక్షన్ డే(పోలింగ్)కు కొద్ది గంటల ముందు విస్కాన్సిస్ లోని కెనోషాలో చివరి ప్రచార సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లకు జనం ఎందుకు ఓటేయకూడదో అనూహ్య వివరణను ఇచ్చారాయన..

జడ్జికే జైలు, జగన్ తప్పించుకోలేరు -అటార్నీ చెప్పిందిదే -పీపీఏను బెదిరిస్తే పైసలొస్తాయా?: రఘురామ

ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ కమల..

ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ కమల..

డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష రేసులో నిలబడిన కమలా హ్యారిస్ అసలు లక్ష్యం అమెరికాకు తొలి మహిళా ప్రెసిడెంట్ కావడమేని, ఫలితాలను బట్టి మరో నెల రోజుల్లో ఆ దృశ్యాన్ని దేశం చూడబోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలారా... ఆ కమలా హ్యారిస్ అమెరికాకు ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ కావాలని కలలు కంటోంది. దీన్ని మనం అంగీకరించగలమా? నిద్రపోతు జోబైడెన్ పొరపాటున గెలిస్తే గనుక.. నెల రోజులు తిరిగేలోపే కమల ప్రెసిడెంట్ బాధ్యతలు చేపడుతుంది. ఇది మీకు సమ్మతం కాదని నాకు తెలుసు. మీరంతా బైడెన్ కు ఓటేయకుండా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలు..'' అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

అసలెవరీ కమలా? ఆ పేరేంటి?

అసలెవరీ కమలా? ఆ పేరేంటి?

జోబైడెన్ గెలిస్తే.. నెల రోజులు తిరిగేలోపే అధ్యక్ష పగ్గాలు కమలా హ్యారిస్ చేపడుతుందని, కాబట్టే వాళ్లకు ఓట్లేయొద్దని ఓటర్లను కోరిన ట్రంప్.. కమల పేరును, ఆమె ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలెవరీ కమలా? తన పేరు సరిగ్గా పలకాలని పదే పదే అంటోంది. ఆమెను కామా అనాలా? హ్యార్రిస్ లేదా హర్రిస్ అని పిలవాలా? కమల పచ్చి లెఫ్టిస్టు. ర్యాడికల్ మూమెంట్ తో ఆమెకు సంబంధాలున్నాయి. బైమిస్టేక్ అలాంటివాళ్లు గెలిస్తే.. బైడెన్ ను పక్కకు నెట్టేసి ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ కావాలనుకుంటోంది. ముమ్మాటికీ అలా జరగకూడదనే నేను, నాతో పాటు జనం కోరుకుంటున్నారు''అని ట్రంప్ అన్నారు.

బైడెన్‌తో తలపడినా చివరికి..

బైడెన్‌తో తలపడినా చివరికి..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రారంభంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్.. జోబైడెన్ తో తలపడటం, పార్టీ ప్రీమియర్ లో ఆశించిన మద్దతు రాకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకోవడం, దాంతో బైడెన్ కు అభ్యర్థిత్వం లభించడం తెలిసిందే. అయితే బైడెన్ అనూహ్యరీతిలో తన రన్నింగ్ మేట్(ఉపాధ్యక్ష అభ్యర్థిగా) కమలను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్టీ ప్రీమియర్ లో బైడెన్ ను ఉద్దేశించి కమల చేసిన విమర్శలను సైతం ట్రంప్ తన ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. బుధవారం మధ్యాహ్నం నాటికి అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలిపోనుంది. ఒకవేళ బైడెన్ గెలిస్తే.. ట్రంప్ చెప్పినట్లు కమలా హ్యారిస్ పగ్గాలు చేపడతారా? లేదా? అనేది అస్పష్టం.

English summary
Claiming that Democratic vice presidential candidate Kamala Harris wants to be the first woman president of the United States, President Donald Trump told his supporters that this is one good reason not to vote for his challenger Joe Biden. Trump has been claiming that if 77-year-old Biden wins Tuesday's elections, his running mate Harris will takeover as president in a month's time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X