అగ్నిగోళంలా మారిన పాకిస్తాన్- విచ్చలవిడిగా..!!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, తదనంతరం ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం.. పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, రావల్పిండి, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చర్యలను తప్పుపడుతూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. దాడులకు పాల్పడ్డారు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌ను హత్య చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఖమేనీని అమెరికా- ఇజ్రాయెల్ కలిసి హత్య చేశాయంటూ మండిపడ్డారు. పాకిస్తాన్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో కొన్ని నగరాల్లో స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Karachi and Baghdad Protests Turn Violent as Tear Gas Flares Near US Consulate Over Khamenei Killing

కాగా- కరాచీలో ఈ ఆందోళనల తీవ్రత అధికంగా కనిపించింది. నిరసనకారులు ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. గేట్లు దాటుకుని ఆవరణలోకి ప్రవేశించారు. కర్రలతో విరుచుకుపడ్డారు. రాళ్లు రువ్వారు. చేతికి అందిన వస్తువులను కాన్సులేట్ కార్యాలయంపైకి విసిరేశారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు భళ్లుమంటూ పగిలిపోయాయి. అక్కడితో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కొన్ని భాగాలకు నిప్పు కూడా పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదే సమయంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మధ్యప్రాచ్యంలో సైనిక ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఖమేనీ హత్యపై ఆగ్రహించిన నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రాంతీయ అస్థిరతకు అమెరికానే కారణమని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో విదేశీ సైనిక జోక్యాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

భారత్‌లో కూడా ఖమేనీ మరణానంతరం నిరసనలు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమేనీ మరణాన్ని షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని హత్య చేశాయని ఆయన ఆరోపించారు. ఓ బలమైన నాయకుడిని కోల్పోవడం ఇది మొదటిసారి కాదని ఆవేదనను వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+