ఇరాన్ లో ఎటు చూసినా..
నిన్నటివరకు నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్‌టౌన్‌లో భారీ పేలుడు జరిగి దట్టమైన పొగ అలముకుంది. పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా-ఇరాన్ అణు చర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడులను ధృవీకరించారు కూడా. ప్రీవెంటివ్ మిస్సైల్ అటాక్ ను ప్రారంభించినట్లు తెలిపారు.

మొత్తం 30 నుంచి 40 ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఆ దేశాధ్యక్షుడి భవనం, సైన్యనాధికారుల కార్యాలయాలు/నివాసాలు, సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు.. ఇవన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ దేశాల గగనతలాన్ని మూసివేశారు. పౌర విమానాలేవీ కూడా అక్కడ తిరుగాడట్లేదు. టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించిన వెంటనే పైలట్లకు తక్షణమే హెచ్చరికలు జారీ అయ్యాయి.
సైనిక విమానాల కోసం మాత్రమే గగనతలాన్ని తెరిచి ఉంచారు. టెహ్రాన్ నగర వీధులన్నీ కూడా చెల్లాచెదురుగా కనిపించాయి. జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడి వరకే పరిమితం కాలేదీ దాడులు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక నివాసం సమీపంలోనూ సంభవించాయి.
گزارشها و تصاویر دریافتی از 'شنیده شدن صدای جنگنده و سه انفجار حوالی مرکز #تهران، شنبه ۹ اسفند'#Iran #Tehran #Israel pic.twitter.com/0k7sS0dRBV
— Vahid Online (@Vahid) February 28, 2026
హైసెక్యూరిటీ జోన్ గా పరిగణించే ఈ ప్రాంతం మొత్తం కూడా బాంబు పేలుళ్లతో అట్టుడికి పోయింది. ఖమేని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియరావట్లేదు. టెహ్రాన్ విడిచి వెళ్లినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టెహ్రాన్‌లో పేలుళ్లు, పొగలు ఆకాశంలోకి ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Breaking: Israel has launched an attack on Iran. 💥
— S.L. Kanthan (@Kanthan2030) February 28, 2026
Is this the beginning of a protracted war?
Will Iran retaliate?
Will the US join in? pic.twitter.com/FvOKB3tEQn
-
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఈ సాయంత్రం మోదీ అత్యవసర భేటీ- కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం? -
కేంద్రం వరాల సునామీ -
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
ఇజ్రాయెల్ భీకర ప్రతీకారం: హిజ్బుల్లా మాస్టర్‌మైండ్ హతం! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications