• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిడ్నాప్: పాప ఆచూకీ చెప్పిన వారికి రూ. 5.60 కోట్ల రివార్డ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఓ మారుమూల క్యాంపు సైట్ నుంచి అపహరణకు గురైందని భావిస్తున్న నాలుగేళ్ల బాలిక ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5.60 కోట్లు) రివార్డు అందిస్తామని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.

aus

పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్వాబ్బా బ్లోహోల్స్ తీరప్రాంతంలో తమ కుటుంబం ఏర్పాటు చేసుకున్న శిబిరంలో క్లియో స్మిత్ (4) చివరిసారిగా శనివారం తెల్లవారుజామున నిద్రపోతూ కనిపించింది.

కాసేపటి తర్వాత చూస్తే గుడారం తెరిచిఉందని, లోపల నిద్రపోతున్న తన కూతురు స్లీపింగ్ బ్యాగ్‌తో పాటు కనిపించలేదని ఆమె తల్లి చెప్పారు.

చిన్నారి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

"క్లియోకి ఏం జరిగిందో మన కమ్యూనిటీలో కొందరికి తెలుసు" అని పశ్చిమ ఆస్ట్రేలియా పోలీసు కమిషనర్ కల్నల్ బ్లాంచ్ గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు.

" మాకు ఉపయోగపడే సమాచారం వారి వద్ద ఉంది. దాన్ని మీరు మాతో ఎందుకు పంచుకోవాలో చెప్పేందుకు లక్ష కారణాలు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారని కల్నల్ బ్లాంచ్ చెప్పారు.

క్లియో తనంతట తానుగా ఆ ప్రాంతం నుంచి వెళ్లి ఉండక పోవచ్చని, టెంట్ జిప్ ఆమెకు అందనంత ఎత్తులో తెరిచి ఉందని విచారణ అధికారులు వెల్లడించారు.

'' క్లియోని ప్రాణాలతో కాపాడతామనే నమ్మకం మాకుంది. కానీ ఆమె భద్రత గురించే కాస్త ఆందోళన చెందుతున్నాం'' అని డిప్యూటీ సూపరింటెండెంట్ రాడ్ వైల్డ్ చెప్పారు.

"అనువైన సమయం కోసం వేచి చూసి, చిన్నారిని టెంట్ నుంచి ఎత్తుకెళ్లినట్లు'' సంఘటనా స్థలం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం తెలిసింది.

"గత కొద్ది రోజులుగా భయం భయంగా జీవిస్తున్నాం. మాకు అసలు నిద్రే పట్టడం లేదు" అని భావోద్వేగంగా క్లియో తల్లి ఎల్లీ స్మిత్ మీడియా సమావేశంలో తెలిపారు.

"ప్రతి ఒక్కరూ మాకు ఏం కావాలి అని అడుగుతున్నారు. మాకు కావలసిందల్లా మా అమ్మాయి ఇంటికి తిరిగిరావడం. దారుణమైన విషయం ఏంటంటే, చిన్నారిని రక్షించడానికి ఇంతకుమించి ఇంకేమీ చేయలేకపోతున్నాం. ఇక అది మా చేతుల్లో లేదు కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు అనిపిస్తోంది. మా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాం"

క్లియో కుటుంబం వారాంతంలో క్యాంపింగ్ ట్రిప్ కోసం, 900 కిలో మీటర్ల దూరాన ఉన్న పెర్త్‌కు ఉత్తరాన మారుమూల ప్రాంతమైన క్వాబ్బా బ్లోహోల్‌కి వెళ్లారు.

మాక్లియోడ్‌లోని క్వోబ్బా బ్లోహోల్ సైట్, కోరల్ కోస్ట్‌లో ఉన్న ఒక స్థానిక పర్యాటక ప్రాంతం. అందమైన తీర ప్రాంతాలు, సముద్ర గుహలు, లాగూన్లకు ప్రసిద్ధి.

శుక్రవారం రాత్రి డిన్నర్ తర్వాత క్లియోను పడుకోబెట్టాను. శనివారం తెల్లవారు జామున 1:30 ప్రాంతంలో తాగడానికి నీళ్లు అడిగినప్పుడు ఆమెను చివరిసారిగా చూశానని ఆమె తల్లి చెప్పారు.

క్లియో, తమ గుడారంలోని ప్రత్యేక గదిలో తన చెల్లెలు మంచం పక్కన ఉన్న పరుపుపై నిద్రపోతున్నట్లు ఎల్లీ స్మిత్ వివరించారు.

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చిన్న కుమార్తెకు బాటిల్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, టెంట్ తెరిచి ఉండటాన్ని చూశానని చెప్పారు. అప్పటికే టెంట్‌లో క్లియో లేదని వెల్లడించారు.

"ఆమె టెంట్ చుట్టు పక్కల లేదని నిర్ధారించుకున్న తర్వాత మేం ట్రెక్కింగ్ చేస్తూ ఆమెను వెతుక్కుంటూ వెళ్లాం" అని పేర్కొన్నారు.

"ఆ తర్వాత మేం కారులో ప్రతి చోటా తిరగడం ప్రారంభించాం. ఆమె ఆచూకీ ఎంతకీ దొరక్కపోవడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చాం."

తొలుత తీర ప్రాంతానికి సమీపంలో గాలింపు చర్యలు ప్రారంభించామని, వాతావరణ పరిస్థితుల వల్ల ఆటంకం కలిగిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Kidnap:Those who give the info of the girl will be rewarded with Rs.5.60 crore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X