Kim అరాచకం పరాకాష్టకు: నవ్వారంటే చచ్చారే..ప్రాణం పోయినా శవం ఇంట్లోనే..!!
ప్యాంగ్యాంగ్: అదేంటో కానీ ఉత్తరకొరియాలో చీమ చిటుక్కుమన్నా అది ప్రపంచానికి పెద్ద వార్తే అవుతుంది. ఎందుకంటే ఆ దేశాన్ని పాలిస్తున్నది కిమ్ జాంగ్ ఉన్. మనిషి ఎంత పొట్టిగా ఉంటాడో... అంతకంటే ఎక్కువగా తన నిర్ణయాలతో దేశాన్ని గడగడలాడిస్తుంటాడు. ఒకప్పుడు కరోనా లక్షణాలు ఫలానా వ్యక్తిలో కనిపించాయని తెలిస్తే చాలు వారిని చంపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారంటూ పలు వార్తలు వచ్చాయి. ఇక ఆ దేశం నుంచి తప్పించుకుని పారిపోయామా... ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వేటాడి వెంటాడి చంపేస్తారు. ఎలా చనిపోయారో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఉత్తరకొరియాలోని కిమ్ ప్రభుత్వం రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదేశ ప్రజలు నవ్వకూడదని, అదే సమయంలో మద్యం సేవించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ దీని వెనక కారణం ఏంటో చూద్దాం...
Recommended Video

నవ్వితే చచ్చారే..
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏ డెసిషన్ తీసుకున్నా అది సంచలనంగానే మారుతుంది. మనిషి భూమికి జానెడున్నప్పటికీ... అగ్రరాజ్యాలనే గడగడలాడించిన సత్తా ఉన్నవాడు. ఎవడైతే నాకేంటి.. నేను పీకేది పీకుతా అని వాదించే మొండి ఘటం. తాజాగా కిమ్ ప్రభుత్వం 11 రోజుల పాటు దేశ ప్రజలు నవ్వకూడదని అదే సమయంలో మద్యం కూడా సేవించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ దేశ ప్రజల ప్రాణాలు కిమ్ గుప్పిట్లో ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే పొరపాటున ఎవరైనా నవ్వడం కనిపించారో అంతే సంగతులు... ఆ కుటంబంలో ఏడుపులు పెడబొబ్బులు వినిపించాల్సిందే. ఇంతకీ ఎందుకు నవ్వకూడదని చెప్పారంటే.. కిమ్ తండ్రి ఆదేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ -2 పదేళ్ల క్రితం మరణించారు. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు ఆదేశంలో 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ 11 రోజుల పాటు ఎవరైనా శుభకార్యాలు చేసుకున్నా, ఆనందంతో గడిపినా, సంతోష సంకేతాలు పంపినా వారింట్లో మరణ మృదంగం మోగుతుందంటూ ఆదేశాలు జారీ చేశారు.

సంతోషంగా గడిపితే చాలు...
ఉత్తరకొరియా దేశ ప్రజలు గత జన్మలో ఏం పాపం చేశామో ఏమో అంటూ ఈ జన్మలో ఈ కిరాతకుడి పాలనలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధను కిమ్ తండ్రి సంతాప దినాలతో కనెక్ట్ చేసి అలా బాధతో 11 రోజులు గడిపేందుకు సిద్ధమయ్యారు. ఇక డిసెంబర్ 17వ తేదీన కిమ్ జాంగ్-2 వర్ధంతి. ఆరోజున కనీసం కూరగాయలు కొనేందుకు కూడా బయటకు రాకూడదని మరీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా ఏమైనా సంతాప దినాలను పాటించాల్సి ఉన్న సమయంలో కొందరు సంతోషంగా గడపడం, మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారిని ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి వారిని నేరస్తులుగా పరిగణించారు. వారిని ఎక్కడికో తీసుకెళ్లారు.. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి జాడ లేదు.

ఎవరైనా మరణిస్తే...
ఇక సంతాప దినాలు దేశంలో అమలులో ఉన్న సమయంలో కుటుంబంలో ఎవరైనా మరణించినా గట్టిగా బయటకు ఏడవకూడని దుస్థితి అక్కడ నెలకొంది. సంతాప దినాలు ముగిశాకే చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మొదటి సంతాప దినం రోజు ఎవరైనా మరణిస్తే ... ఆ మృతదేహంను ఇంట్లోనే మరో 10 రోజుల పాటు నిల్వ చేసి ఉంచాల్సి ఉంటుంది. బయటకు తీసుకురాకూడదట. సంతాప దినాలు ముగియగానే మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించాలని నిబంధనలు తీసుకొచ్చారు. ఇక సంతాప దినాల సమయంలో ఎవరైనా సంతోషంగా ఉంటూ సంబరాలు చేసుకుంటున్నారా అని తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని కూడా కిమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు నిత్యం డేగ కళ్లతో దేశ ప్రజలను కనిపెడుతూ ఉంటారు. ఈ నిఘా పోలీసులకు ఒక నెలరోజుల పాటు నిద్ర ఉండదు. వీరు నిత్యం పహారా కాస్తూ ఉండాలి.

కిమ్ జాంగ్-2 మరణం
2011 డిసెంబర్ 17వ తేదీన కిమ్ జాంగ్-2 గుండెపోటుతో మరణించాడు. మరణించే నాటికి ఆయన వయస్సు 69 సంవత్సరాలు. అప్పటికే ఒక నియంతలా కిమ్ జాంగ్ -2 పదిహేడేళ్ల పాటు ఉత్తరకొరియాను పాలించారు. ఆ తర్వాత మరణించాక ఆయన మూడో కొడుకు ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టారు. తండ్రి కంటే క్రూరుడు అనే పేరును ఈ పొట్టాయన గడించాడు. తినడానికి తిండి లేదు కానీ... తన అణ్వాయుధాలతో అగ్రరాజ్యాలను గడగడలాడిస్తున్నాడు. దేశంలో ఎవరైనా ఎదురుతిరిగారో అంతే ఆ వ్యక్తికి భూమి మీద నూకలు చెల్లినట్లే. అది సొంత మనిషా లేక పరాయి మనిషా అన్న విబేధాలు మన బాస్ దగ్గర చెల్లవు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications