కిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులు

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: వరుసగా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా ప్రజలు దయ్యం వ్యాధితో బాధపడుతున్నారు. అత్యధికంగా రేడియేషన్ వెలువడుతున్న కారణంగా అంతు చిక్కని వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రేడియేషన్ కారణంగా మరణించిన వారి సంఖ్య లెక్క తేలడం లేదు.

ట్రంప్‌కు పుతిన్ షాక్: 'ఉ.కొరియాతో సంబంధాలు తెంచుకోం, ఆంక్షలు'

వరుస అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచాన్ని భయాందోళనలకు గరి చేస్తోంది. అయితే ఉత్తరకొరియాపై దాడికి తాము సిద్దంగా ఉన్నామని అమెరికా, దక్షిణ కొరియాలు సంకేతాలు పంపాయి.

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?

అమెరికా సవాళ్ళకు ఉత్తరకొరియా వెనుకాడలేదు. తాము కూడ దేనికైనా సిద్దమంటూ సంకేతాలను పంపింది. తాజాగా ప్రయోగించిన క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేసే శక్తి కలిగి ఉంది.

కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'

ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?

 ఉత్తరకొరియాలో రేడియేషన్‌తో దయ్యం వ్యాధులు

ఉత్తరకొరియాలో రేడియేషన్‌తో దయ్యం వ్యాధులు

వరుసగా అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండడంతో విపరీతమైన రేడియేషన్ ప్రభావం ఉత్తరకొరియాపై కన్పిస్తోంది. రేడియేషన్ కారణంగా ప్రజలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రేడియేషన్‌ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్‌ డిసీజ్‌' తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతారని ఓ సైనికుడు వెల్లడించారు.అవయవ లోపంతో జన్మించిన శిశువులను చంపేస్తారని ఆయన తెలిపారు.

అంతుచిక్కని వ్యాధులు

అంతుచిక్కని వ్యాధులు

అంతుచిక్కని వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. అణు పరీక్షల వల్ల విడుదలైన కాలుష్య పదార్థాలు ఉత్తరకొరియా దేశ ప్రజలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గర్భస్థ శిశువులపైనా, స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి, నాడీ వ్యవస్థల మీద రేడియేషన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తెలిసింది.

 పంగ్వేరీ వద్ద విపరీతమైన రేడియేషన్

పంగ్వేరీ వద్ద విపరీతమైన రేడియేషన్

2011లో కింగ్‌ జాంగ్‌ ఉన్‌ ఉత్తరకొరియాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఇటీవల కాలంలో కిమ్ జంగ్ ఉన్ అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచదేశాలకు సవాళ్ళు విసురుతున్నాడు. ఉత్తరకొరియాలో ఉన్న అణు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన ‘పంగ్యే రీ' వద్ద రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో పంగ్యే రీ వద్ద పహారా ఉంటున్న సైనికులు అంతుచిక్కని దెయ్యం వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. దీంతో భయాందోళనలకు గురవుతున్న సైనికులు.. తప్పించుకునేందుకు దక్షిణ కొరియాలోకి పారిపోతున్నారు.

పారిపోతున్న సైనికులు

పారిపోతున్న సైనికులు

ఇప్పటివరకు 30 మంది ఉత్తరకొరియా సైనికులు అనారోగ్య కారణాల రీత్యా దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయి. రేడియేషన్‌​కారణంగా విపరీతమైన నొప్పికి సైనికులు గురైనట్లు వారికి చికిత్స అందించిన దక్షిణ కొరియా వైద్యులు చెప్పారు. అణు పరీక్షల వల్ల ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని దక్షిణ కొరియాలోకి పారిపోయి వచ్చిన ఓ సైనికుడు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kim Jong-un's nuke tests have led to a 'ghost disease' that deforms babies and leaves North Koreans exposed to radiation, defectors claim

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి