ఆ వీడియోలు చూస్తే..: కిమ్ కర్దాషియన్ వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు తన పిల్లల పట్ల భయం పట్టుకుంది. అల్టాన్ స్టెర్లింగ్, ఫిలాండ్ కాస్టిల్ కాల్పుల ఘటనల వల్ల ఆమె అప్ సెట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరిగి అమాయలుకు చనిపోతున్నారని, దీంతో తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంది.

ప్రియుడి కాల్చివేతపై ప్రియురాలు వీడియో: మళ్లీ కాల్పులు, ఒబామా సంచలనం

చిన్నారులు నార్త్ (3), సెయింట్ (7 నెలలు) కిమ్ సంతానం. కాగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక నల్ల జాతి వారు చనిపోవడం బాధాకరమని ఉద్వేగానికి లోనైంది. ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోందని చెప్పింది.

kim

పోలీసులను చూసి భయపడవద్దని తన పిల్లలకు నేర్పిస్తానని చెప్పింది. ఎందుకంటే ఇటీవల ఘటనను వీడియోలో చూసిన తర్వాత తీవ్ర ఆవేశానికి లోనయ్యానని, మనుషుల రంగు అనేది ఇక్కడి భద్రతా సిబ్బందికి ముఖ్యాంశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా ప్రజలందరం కలిసి పోరాడి వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reality TV star Kim Kardashian West says she worries her two children, North and Saint, will grow up thinking that "their lives don't matter".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X