Kim Yo Jong వార్నింగ్: తమాషాలొద్దు బిడ్డా:అణుబాంబులతో వేటాడుతాం:దేశమే ఉండదు..!!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారా..? అగ్రరాజ్యాలను సైతం తన క్షిపణి ప్రయోగాలతో బెదరగొట్టిన కిమ్ జాంగ్ ఉన్ ఈ సారి తన పొరుగుదేశమైన దక్షిణ కొరియాపై కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉన్నారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ దాయాది దేశంపై కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు పగబట్టారు... ఆయన సోదరి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం..?

కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్

ఉత్తరకొరియా మళ్లీ తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కాస్త సైలెంట్‌గా వ్యవహరించిన కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈసారి దక్షిణ కొరియానే లేకుండా చేస్తామనే సంచలన ప్రకటనలు ఆదేశం నుంచి వెలువడుతున్నాయి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతుంటే కిమ్ జాంగ్ ఉన్ సోదరి చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఇంతకీ కిమ్ జాంగ్ ఉన్ సోదరి ఏం వ్యాఖ్యలు చేసింది..?

అణుబాంబులతో ఆటాడుకుంటాం

అణుబాంబులతో ఆటాడుకుంటాం

అప్పుడప్పుడు క్షిపణి ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఉత్తర కొరియా తాజాగా ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి అణ్వాయుధాల వినియోగంపై చేసిన సంచలన ప్రకటన ప్రధాన వార్తల్లో నిలిచింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియాను అణుబాంబుతో పేల్చివేస్తామంటూ హద్దులు దాటి బెదిరింపులకు దిగింది. సౌత్ కొరియా కనుక సైనిక ఘర్షణ ప్రారంభిస్తే ఉత్తరకొరియా చేతులు కట్టుకుని కూర్చోదని అణ్వాయుధాలు ఉపయోగించేందుకు సైతం వెనకాడబోదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కిమ్ యో జాంగ్. ఈ విషయాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తన పత్రికలో ప్రచురించింది.

 ఉత్తరకొరియా మిలటరీ స్థావరాలపై దాడి

ఉత్తరకొరియా మిలటరీ స్థావరాలపై దాడి

ఉత్తరకొరియాపై ఆయుధాల వినియోగం ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో కిమ్ సర్కార్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక పంపాడు. 2017 తర్వాత ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే దక్షిణ కొరియా రక్షణ శాఖ చీఫ్ చేసిన వ్యాఖ్యలతోనే కిమ్ జాంగ్ ఉన్ సోదరి ఇలాంటి సంచలన ప్రకటన చేసిందనే అభిప్రాయం ఉంది. ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకుని ఆదేశ మిలటరీ ప్రాంతాలను ధ్వంసం చేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా డిఫెన్స్ చీఫ్ సూహ్‌ ప్రకటన చేశారు. అంతేకాదు ఉత్తరకొరియా మిలటరీ స్థావరాలు ఎక్కడెక్కడున్నాయో తమకు స్పష్టమైన సమాచారం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.

రెచ్చగొడితే ఒక్కరు కూడా మిగలరు

రెచ్చగొడితే ఒక్కరు కూడా మిగలరు

ఈ ప్రకటనే కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్‌కు ఆగ్రహం తెప్పించి ఉంటాయి. ఒకవేళ తమతో యుద్ధం కావాలని సౌత్ కొరియా భావిస్తే ఆదేశాన్నే లేకుండా అణుబాంబులతో ధ్వంసం చేస్తామంటూ ఘాటు హెచ్చరిక పంపింది కిమ్ యో జాంగ్. తమ దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నామని... అయితే శతృదేశాలు తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక వేళ దాయాది దేశంపై ఈ అణుబాంబులతో దాడి చేస్తే అక్కడ ఒక్కరు కూడా మిగలరని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. అంతేకాదు దక్షిణ కొరియా ఉత్తర కొరియాకు ఎప్పుడూ సమఉజ్జీవి కాదని వెల్లడించింది.

అసంపూర్తిగా చర్చలు

అసంపూర్తిగా చర్చలు

మొత్తానికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ చాలా డేంజరస్‌ అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కిమ్ సలహాదారుల్లో అతి కీలక పాత్ర ఆమె పోషిస్తోందని చెబుతున్నారు. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన నాటి నుంచి సుదూర లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగాలకు ఉత్తరకొరియా బ్రేక్ ఇచ్చింది. అయితే అప్పుడు మధ్యలోనే ఆగిపోయిన చర్చలు ఆ తర్వాత పునఃప్రారంభం కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+