వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్ చార్లెస్ 3: 775 గదుల బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో ఉంటారా? 20 వేల ఎకరాల్లోని సాండ్రింగమ్ హౌజ్‌ను ఎంచుకుంటారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి మొదటగా క్వీన్ విక్టోరియా పరిపాలించారు

రాజుకు ఎన్నో విలాసాలు అందుబాటులో ఉంటాయి. ఈ విలాసాల జాబితాలో విలాసవంతమైన ఇళ్లు కూడా ఒక భాగమే.

రాజప్రాసాదాలు, రాజ భవనాలు, కోటలు, కాటేజ్‌లు ఇలా రాజహంగులతో కూడిన భవనాలు కింగ్ చార్లెస్ 3 వద్ద ఉన్నాయి.

ఇందులో కొన్ని పదవిని బట్టి లభిస్తాయి. మరికొన్ని రాజు వ్యక్తిగత ఆస్తులు.

ఇంకా 'డచెస్ ఆఫ్ కార్న్‌వాల్'‌కు చెందిన భవనాలు, 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' ప్రైవేట్ ఎస్టేట్లు కూడా ఉంటాయి. 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్'గా ఉన్న సమయంలో చార్లెస్ 3 ఈ ప్రైవేట్ ఎస్టేట్‌లోనే ఉండేవారు.

''యూకే జీవనవ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఈ తరుణంలో రాజ కుటుంబం బహుళ నివాసాలను కలిగి ఉండటం అంత మంచిది కాదు'' అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని హిస్టరీ ఆఫ్ మోనార్కీ ప్రొఫెసర్ అనా వైట్‌లాక్ అన్నారు.

రాజుకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుందని అంటున్నారు. కాబట్టి అందుబాటులో ఉన్న అనేక నివాసాల్లో ఆయన నివసించడం కోసం ఏ ఇంటిని ఎంచుకోనున్నారు?

2019లో బకింగ్‌హమ్ ప్యాలెస్ గార్డెన్ పార్టీ సందర్భంగా అతిథులతో ప్రిన్స్ చార్లెస్

బకింగ్‌హమ్ ప్యాలెస్

రాజ కుటుంబ దర్పాన్ని చూసే ప్రముఖ చిహ్నాల్లో ఇదొకటి. లండన్‌లోని ఈ కోటలో మొత్తం 775 గదులు ఉంటాయి.1837 నుంచి ఈ భవనం బ్రిటిష్ రాజరికపు పాలన ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రతీ ఏడాది ఇక్కడ నిర్వహించే అధికారిక కార్యక్రమాల కోసం దాదాపు 50,000 మంది అతిథులకు ఈ భవనం ఆతిథ్యం ఇస్తుంది. ప్రస్తుతం దీన్ని పునరుద్ధరిస్తున్నారు.

ఈ భవనాన్ని కార్యాలయ విధుల కోసం మరింతగా ఉపయోగించుకోవాలని గతంలో చార్లెస్ అన్నట్లు రాయల్ హిస్టోరియన్ రాబర్ట్ లేసీ చెప్పారు.

రాజు, తన నివాస గృహాల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి.

విండ్సర్ క్యాజిల్

1969లో విండ్సర్ కోటలో రాజ కుటుంబ సభ్యులు ప్రిన్స్ ఎడ్వర్డ్, ద డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్సెస్ ఆన్నె, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ ఆండ్రూ

విండ్సర్ క్యాజిల్

ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతనమైన కోటగా విండ్సర్ క్యాజిల్‌ను చెబుతారు. క్వీన్ ఎలిజబెత్ 2 ఒకప్పుడు వారాంతాల్లో ఇక్కడే గడిపేవారు. కరోనా మహమ్మారి మొదలయ్యాక ఆమెకు ఇదే ప్రధాన నివాసంగా మారింది.

కింగ్ చార్లెస్ 3 ఈ కోటలో ఎంత కాలం ఉంటారో చూడాలి.

'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' కుటుంబం ఈ మధ్య దీనికి సమీపంలోని అడిలైట్ కాటేజ్‌కు మారిపోయారు. తర్వాత కాలంలో వారు విండ్సర్‌లో ఉంటారని అంచనా వేస్తున్నారు. విండ్సర్ పట్టణం, లండన్‌కు 35 కి.మీ దూరంలో ఉంటుంది.

''విండ్సర్ కోట, విలియంకు ఇష్టమైన ప్రదేశంగా మారుతుందని భావిస్తున్నా'' అని లేసీ చెప్పారు.


స్కాట్లాండ్, ఎడిన్‌బరాలోని హోలీరూడ్‌హౌజ్

హోలీరూడ్‌హౌజ్ ప్యాలెస్

హోలీరూడ్‌ హౌజ్ ప్యాలెస్ అనేది స్కాట్లాండ్‌లో రాజు అధికార నివాసం. బకింగ్‌హమ్ ప్యాలెస్, విండ్సర్ క్యాజిల్ లాగే ఇది కూడా రాజు ఆస్తి .

ప్రతీ ఏడాది అధికారిక, జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ క్వీన్ ఎలిజబెత్ ఇక్కడే ఇక వారం రోజులు గడిపేవారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోదాలో చార్లెస్ కూడా ఇక్కడ కొంత సమయం గడిపేవారు.

ఈ భవనంలో 289 గదులు ఉన్నాయి. ఇందులో 17 గదులను ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంచుతారు.

నార్తర్న్ ఐర్లాండ్‌లోని హిల్స్‌బరో క్యాజిల్

హిల్స్‌బరో క్యాజిల్ వద్ద 2019లో కింగ్ చార్లెస్, క్వీన్ కన్సొర్ట్ క్యామిలా

హిల్స్‌బరో క్యాజిల్

ఇటీవలే ఈ భవనం అందరి దృష్టిలో పడింది. ఇక్కడే పెన్ లీక్ అవ్వడంతో కింగ్ చార్లెస్ అసహనానికి లోనయ్యారు. ఇది నార్తర్న్ ఐర్లాండ్‌లో చక్రవర్తి అధికారిక నివాసం.

18వ శతాబ్ధం నాటి ఈ భవనాన్ని 100 ఎకరాల తోటలో నిర్మించారు. ఇది పర్యాటకుల ఆకర్షణ కేంద్రంగా ఉంది.

1986లో గ్లోసెస్టర్‌షైర్‌లోని హైగ్రోవ్ నివాసం వద్ద ప్రిన్స్ చార్లెస్

హైగ్రోవ్ హౌజ్

చార్లెస్ నివాసం, 1980లో ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌కు మారింది. అప్పుడు ఈ ఎస్టేట్‌ను ఆయన రీడిజైన్ చేశారు.

ఆయన మాజీ భార్య డయానాకు ఈ ఎస్టేట్ నచ్చలేదని చెబుతుంటారు.

ఈ ప్రాపర్టీ, 'డచీ ఆఫ్ కార్న్‌వాల్' యాజమాన్యంలో ఉంటుంది. దీనికి 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్' అధికారిగా ఉంటారు. ఒకవేళ రాజు ఇక్కడ ఉండాలని అనుకుంటే ఆయన తన కుమారుని ఇంట్లో అద్దెకు ఉన్నట్లు అవుతుంది.

సాండ్రింగమ్ హౌజ్

ఈ ఏడాది ప్రారంభంలో సాండ్రింగమ్ ఫ్లవర్ షో కార్యక్రమంలో క్వీన్ కన్సొర్ట్ క్యామిలా, కింగ్ చార్లెస్

సాండ్రింగమ్ హౌజ్

ఇతర రాజ నివాసాల్లా కాకుండా ఇంగ్లండ్‌, నార్‌ఫోక్‌లోని ఈ కంట్రీ హౌజ్... చక్రవర్తి వ్యక్తిగత ఆస్తి.

దీన్ని నిజానికి కింగ్ ఎడ్వర్డ్-7 కొన్నారు. తర్వాత ఇది వారసత్వంగా బదిలీ అవుతోంది.

క్వీన్ ఎలిజబెత్ 2, శీతాకాలంలో ఇక్కడ ఉండేవారు.

ఈ 20,000 ఎకరాల ఎస్టేట్‌ను 2017లో చార్లెస్ తీసుకున్నారు. అప్పటి నుంచి దీన్నొక పూర్తిస్థాయి సేంద్రీయ సంస్థగా మార్చడం మొదలుపెట్టారు.

1960లో బల్మోరల్ కోట దగ్గర చార్లెస్, క్వీన్ ఎలిజబెత్ , డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా, ప్రిన్సెస్ ఆన్నె, బేబీ ప్రిన్స్ ఆండ్రూ (వరుసగా కుడి నుంచి)

1997లో బల్మోరల్ క్యాజిల్ దగ్గరి నది వద్ద తన కుమారులతో ప్రిన్స్ చార్లెస్

బల్మోరల్ క్యాజిల్

బల్మోరల్ క్యాజిల్ కూడా వ్యక్తిగత నివాసమే. క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ దీన్ని అభివృద్ధి చేశారు.

క్వీన్ ఎలిజబెత్ 2, సెప్టెంబర్ 8న ఇక్కడే మరణించారు. క్వీన్‌కు ఇది వేసవి విడిది కేంద్రంగా ఉండేది. వేసవిలో ఆమె ఇక్కడే గడిపేవారు.

కింగ్ చార్లెస్‌కు కూడా ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉంది. పొరుగునే ఉన్న బిర్క్‌హాల్‌, చార్లెస్‌కు చెందినదే. దాన్ని తన గ్రాండ్‌మదర్ నుంచి వారసత్వంగా పొందారు. ఇక్కడే క్వీన్ కన్సొర్ట్‌తో ఆయన హనీమూన్ సాగింది.

1980లో క్లారెన్స్ హౌజ్ దగ్గర క్వీన్ తల్లి పుట్టినరోజు వేడుకలు

2010లో క్లారెన్స్ హౌజ్ వద్ద అఫ్గానిస్తాన్ సైనికులు మెడల్స్ ఇస్తున్న ప్రిన్స్ చార్లెస్

క్లారెన్స్ హౌజ్

లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌కు ఆనుకొని ఉన్న ఈ భవనం, మిగతా రాజభవనాలతో పోలిస్తే కాస్త తక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది.

''లండన్‌లోని అన్ని రాజ నివాసాల కంటే క్లారెన్స్ హౌజ్ వైభవం చాలా తక్కువగా ఉంటుంది'' అని లేసీ అన్నారు. కానీ, కింగ్ చార్లెస్ 3కు దీనితో చాలా అనుబంధం ఉంది.

''తన గ్రాండ్‌మదర్ ఈ ఇంట్లోనే నివసించేవారు. అందుకే దీనితో రాజుకు చాలా అనుబంధం ఉంది'' అని లేసీ చెప్పారు.

2003-2022 వరకు క్లారెన్స్ హౌజ్, చార్లెస్‌కు లండన్ అధికారిక నివాసంగా ఉంది.

లూనీవెర్మాడ్

వేల్స్‌లోని బ్రెకాన్ బీకాన్స్ నేషనల్ పార్క్ సమీపాన ఉన్న ఈ ఎస్టేట్‌ను 2006లో 'డచెస్ ఆఫ్ కార్న్‌వాల్' కొనుగోలు చేశారు.

మూడు పడక గదులు ఉండే ఈ కాటేజ్‌ను కింగ్ చార్లెస్, క్వీన్ కన్సొర్ట్ కామిలాకు ఉపయోగపడే విధంగా మార్చారు.

వేల్స్‌ సందర్శన సమయంలో చార్లెస్ దంపతులు ఈ భవనంలోనే ఉంటారు.

2017లో డమ్‌ఫ్రైస్ హౌజ్ వద్ద ప్రిన్స్ చార్లెస్

డమ్‌ఫ్రైస్ హౌజ్

స్కాట్లాండ్‌లోని ఈ భవనం, అధికారిక రాజ నివాసం కాదు.

కానీ, దీని మరమ్మతుల కోసం రాజు చాలా ప్రయత్నాలు చేశారు.

క్వీన్ ఎలిజబెత్ 2 తీవ్ర అనారోగ్యం పాలయ్యారనే వార్త, ఈ భవనంలో ఉన్నప్పుడే ఆయనకు తెలిసింది. ఇక్కడి నుంచే హెలీకాప్టర్‌లో ఆయన బల్మోరల్ వెళ్లారు.

1957లో క్యాజిల్ మెయ్ వద్ద క్వీన్ తల్లి చిత్రం, 2019లో ప్రిన్స్ చార్లెస్ ఈ కోటను సందర్శించారు

క్యాజిల్ ఆఫ్ మెయ్, 2010 నాటి చిత్రం

క్యాజిల్ ఆఫ్ మెయ్

ఇది స్కాట్లాండ్ తీర ప్రాంతంలో ఉంది. దీన్ని గతంలో బరోగిల్ క్యాజిల్ అని పిలిచేవారు. 1966లో దీన్ని క్వీన్ ఎలిజబెత్ తల్లి కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న 'ది క్రౌన్' సిరీస్‌లో ఈ భవనం కనిపిస్తుంది.

ఇది ఇప్పుడు 'ది ప్రిన్స్ ఫౌండేషన్' ఆధీనంలో ఉంది. ఈ ఫౌండేషన్‌కు రాజు అధ్యక్షుడిగా ఉంటారు.

జూలై చివరన, ఆగస్టు తొలి రోజుల్లో కింగ్, క్వీన్ కన్సొర్ట్ ఇక్కడే ఉంటారు.

టమరిస్క్ హౌజ్

ఇంగ్లండ్‌లోని సిలీ దీవుల్లో పావు ఎకరా విస్తీర్ణంలో ఈ కాటేజ్‌ను నిర్మించారు.

మాజీ భార్య డయానా, తన పిల్లలతో కలిసి రాజు ఇక్కడ ఉండేవారని నివేదికలు చెబుతున్నాయి.

ఇప్పుడు దీన్ని హాలిడే కాటేజ్‌గా అద్దెకు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
King Charles 3: Stay at 775-room Buckingham Palace? Choose Sandringham House on 20,000 acres?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X