"ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ కు అండగా భారత్"
ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్ కు 1.4 బిలియన్ల (140 కోట్ల) భారత ప్రజల తరపున శుభాకాంక్షలను తెలియజేశారు. భారత్- ఇజ్రాయెల్ రెండు పురాతన నాగరికతల కలయికగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్, ఇజ్రాయెల్ రెండూ వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలిగిన దేశాలని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇజ్రాయెల్ పార్లమెంటులో పంచుకున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని భారతదేశం అధికారికంగా గుర్తించిన రోజునే (సెప్టెంబర్ 17, 1950) తాను జన్మించానని.. ఇది ఒక ప్రత్యేకమైన అనుబంధమని ఆయన పేర్కొన్నారు. దాంతో అందరూ చప్పట్లతో స్వాగతించారు.
అలాగే గతేడాది అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. హమాస్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 140 కోట్ల భారతీయుల తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ మద్దతుతో ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన "గాజా శాంతి ఒప్పందానికు భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించిందన్నారు. ఈ చొరవ ద్వారా ఈ ప్రాంతంలో శాంతి ఏర్పడుతుందని భారత్ బలంగా నమ్ముతోందని ప్రధాని మోదీ తెలిపారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ తో సైనిక గౌరవ వందనం సమర్పించింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టగానే సభ మొత్తం నిల్చుని ప్రధాని మోదీకి చప్పట్లతో ఆహ్వానం పలికింది. సభలోని సభ్యులంతా నిల్చుని ప్రధాని మోదీని మోదీ.. మోదీ.. అంటూ చప్పట్లతో ఆహ్వానించారు. దాంతో సభ్యులందరికీ నమస్కారం చేస్తూ ప్రధాని మోదీ తనకు కేటాయించిన సీటులో ఆసీనులయ్యారు.
అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ప్రసంగిస్తూ.. వెల్ కమ్ టూ నెస్సెట్, ప్రధాని నరేంద్ర మోదీ.. అని హిందీలో తెలిపారు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఇక ఈ సమావేశంలో మొదట ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రధాని మోదీ కేవలం స్నేహితుడు మాత్రమే కాదు.. సోదరుడితో సమానం అని అన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న అత్యున్నత స్థాయి దౌత్య, వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి నాయకుడని ప్రశంసించారు నెతన్యాహు.

గత కొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. రక్షణ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మూడు రెట్లు పెరిగిందని వెల్లడించారు. టెల్ అవివ్ లోని విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగిన వెంటనే తాను, తన భార్య సారా ఆయనకు స్వాగతం పలికామని నెతన్యాహు అన్నారు. ఇక 150 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ ఒక గిగాంటిక్ పవర్ అని ఆయన అభివర్ణించారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు











Click it and Unblock the Notifications