వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. కొత్త వైరస్.. రక్కసి మార్బర్గ్, 88 శాతం మరణాలు, ఇప్పటికే ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా మంకీ పాక్స్ కేసులు వస్తున్నాయి. ఇదే టెన్షన్ ఉంటే మరొ కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అవును మార్బర్గ్ వైరస్ భయాందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. దీంతో వైరస్ ఘనాలో తొలుత వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్ సోకిన ఇద్దరు చనిపోయారు. అలాగే వైరస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.

తొలి కేసు.. రెండు మరణాలు...

తొలి కేసు.. రెండు మరణాలు...

గతనెల 26వ తేదీన తొలి కేసును గుర్తించారు. అయితే ఆ 26 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రికి వెళ్లిన మరునాడే చనిపోయాడు. 28వ తేదీన 51 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చేరి.. ఆ రోజే చనిపోయాడు. దీంతో డబ్ల్యూహెచ్‌వో వైరస్ తీవ్రతను తెలియజేసింది. ఇదీ జ్వరమే కానీ.. తీవ్రత ఎక్కువైతే రక్తస్రావం కూడా అవుతుంది. మనుషులతోపాటు జంతువులకు కూడా సోకుతుంది. 88 శాతం మరణాల రేటును కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చికిత్సతో కోలుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కలిగి ఉంది.

ఇవీ లక్షణాలు

ఇవీ లక్షణాలు


వైరస్ సోకితే జ్వరం తీవ్రంగా ఉంటుంది. అలాగే తలనొప్పి కూడా.. అలసటగా ఉంటారు. కండరాల నొప్పు, బాడీ పెయిన్స్ ఉంటాయి. విరేచనాలు నీళ్లుగా వస్తాయి. కడుపు నొప్పి వస్తోంది. తిమ్మిరి ఉంటుంది. బాడీ ఆన్ ఈజీగా ఉంటుంది. కేసు తీవ్రత పెరిగితే రక్తస్రావం అవుతుంది. వాంతి, మలంలో రక్తం కూడా వస్తోంది. చికిత్స లేనందున జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 ప్రత్యక్షంగానే.. కానీ

ప్రత్యక్షంగానే.. కానీ


వైరస్ మనుషులకు డైరెక్ట్‌గా వస్తోంది. గాయం అయినా, వైరస్ ఉన్న వ్యక్తుల నుంచి రక్తం/ స్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కు టీకా లేదు. నోరు.. లేదంటే.. ఇతర ద్రవాలతో రీహైడ్రేషన్ చేయడమే చికిత్సకు మార్గం. ఒక రకమైన గబ్బిలాలు వైరస్‌ను మోసుకొస్తున్నాయి. తొలి కేసు ఉగాండా నుంచి ఆఫ్రికాకు చెందిన కోతులు ద్వారా సంక్రమించింది. అలా ఇద్దరు చనిపోయారు. దీంతో డబ్ల్యుహెచ్‌వో అలర్ట్ అయ్యింది. విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

English summary
World Health Organisation declared Ghana’s first outbreak of Marburg virus after two infected patients died of the disease last month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X