Gold Bars: వినియోగదారులకు భారీ షాక్.. బంగారం అమ్మకాలు నిలిపివేత
Gold Bars: ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ దక్షిణ కొరియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొరియా మింటింగ్ సెక్యూరిటీ అండ్ ఐడీ కార్డ్ ఆపరేషన్(KOMSCO) ప్రజలకు బంగారు కడ్డీలను సరఫరా చేయడం కష్టమవుతోంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్ల బంగారు కడ్డీల అమ్మకాలను కొరియా మింటింగ్ సెక్యూరిటీ అండ్ ఐడీ కార్డ్ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. అమ్మకాల నిలిపివేతకు ముందే వాణిజ్య బ్యాంకుల ద్వారా బంగారు కడ్డీల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. గత నెలలో కొరియన్ వాణిజ్య బ్యాంకుల్లో బంగారు కడ్డీల అమ్మకాలు 22.5 బిలియన్ వోన్లకు చేరుకున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే 16.8 బిలియన్ వోన్ల విలువైన బంగారు కడ్డీలు అమ్ముడయ్యాయి. ఇది బంగారానికి పెరుగుతున్న డిమాండ్ ను సూచిస్తోంది.
ఫిబ్రవరి 11న బంగారు కడ్డీల అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ వాణిజ్య బ్యాంకులకు KOMSCO అధికారిక నోటీసులను పంపింది. బంగారం ధరలు గణనీయంగా పెరగడం వల్ల ముడి బంగారం సరఫరాలో సమస్యలు ఎదుర్కొంంటున్నామని.. దీని కారణంగా అమ్మకాలు ఆగిపోయాయని అధికారిక నోటీసుల్లో పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు అమ్మకాలు మొదలు పెడతామో ఇప్పడే చెప్పలేమని.. అంతదాకా ఎదురు చూడాలని అందులో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు సుంకాల కంటే ముందే అమెరికాకు బంగారు కడ్డీలను పంపడానికి తొందరపడుతున్న సమయంలో ఈ చర్య వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతుండగా.. మనదేశంలో కూడా ధరలు ఆల్ టైం గరిష్టాలకు చేరాయి. న్యూయార్క్ లోని కామెక్స్ లో బంగారం ధరలు అంతర్జాతీయ బెంచ్ మార్క్ ను మించిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారానికి ధర రూ.87 వేలుగా ఉంది.












Click it and Unblock the Notifications