వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓమిక్రాన్ వైరస్- శరీరంపై 21 గంటలు-ప్లాస్టిక్ పై 8 రోజులు తాజా అధ్యయనంలో వెల్లడి

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్ని కుదిపేస్తున్న ఓమిక్రాన్ వైరస్ పై పలు అధ్యయనాలు సాగుతున్నాయి. ఇందులో పలు కొత్త కొత్త అంశాలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఓమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎంత కాలం ఉంటుందనే దానిపై కొత్త అంశాలు బయటపడ్డాయి.

గతంలో వెలుగుచూసిన అన్ని వైరస్ లకు భిన్నంగా ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై 21 గంటల పాటు స0జీవంగా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో నిర్ధారణ అయింది. అలాగే ప్లాస్టిక్ పై 8 రోజుల పాటు ఉంటుందని తేలింది. దీంతో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతంలో బయటపడిన కరోనా వైరస్ వేరియంట్లేవీ ఇంత ఎక్కువ సమయం మనిషి శరీరంపై కానీ, ప్లాస్టిక్ పై కానీ లేవని వెల్లడైంది. ఇతర జాతులతో పోలిస్తే ఇది వేగంగా వ్యాపించడానికి ఇదే కారణమని ఈ అధ్యయనం పేర్కొంది.

latest study reveals Omicron stay on skin for over 21 hours, more than 8 days on plastic

జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వుహాన్‌లో వెలుగుచూసిన SARS-CoV-2 జాతి , మిగతా అన్ని రకాల మధ్య వైరల్ పర్యావరణ స్థిరత్వంలో తేడాలను విశ్లేషించారు. ఇందులో కరోనా జాతుల్లో అధిక పర్యావరణ స్థిరత్వం వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని, అధ్యయనం రచించిన రచయితలు చెప్పారు. ఈ జాతుల్లో ఓమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇది డెల్టా వేరియంట్‌ను భర్తీ చేయడానికి, వేగంగా వ్యాప్తి చెందడానికి వేరియంట్‌ను అనుమతించిన కారకాల్లో ఒకటి కావచ్చని వారు విశ్లేషించారు.

English summary
A recent study revelead that Omicron viru survives much longer on plastic surfaces and skin than the other variants of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X