శ్రీలంక క్రికెటర్లపై దాడి: ఎల్ఈజే ఉగ్రవాదులు అంతం
ఇస్లామాబాద్: ఏడేళ్ల క్రితం పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెటర్లపై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో లష్కర్-ఏ- జగ్వీ (ఎల్ఏజే)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు మరో వ్యక్తి హతమైనాడని పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం అధికారులు తెలిపారు.
ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు అబ్దుల్ వహబ్, అద్నాన్ ఆర్జాద్, జుబైర్ ఆలీ అలియాస్ నాయక్ అహమ్మద్, అటీఖర్ రెహమాన్ లుగా గుర్తించారు. అబ్దుల్ వహబ్, అద్నాన్ అర్షాద్, జుబైర్ లు శ్రీలంక క్రికెటర్లపై దాడి చేశారని కౌంటర్ టెర్రరిజం అధికారులు తెలిపారు.

2009 మార్చి లో శ్రీలంక క్రికెటర్లు పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు. మార్చి మూడవ తేది లాహోర్ లోని గడాఫీ స్టేడియం సమీపంలోన మార్కెట్ దగ్గర శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపి గ్రనేడ్ లతో దాడి చేశారు.
ఉగ్రవాదుల దాడిలో ఎనిమిదిమంది పాకిస్థాన్ పౌరులు, ఆరు మంది పోలీసులు మరణించారు. ఏడుగురు క్రికెటర్లకు, అసిస్టెంట్ కోచ్ కు గాయాలైనాయి. ఉగ్రదాడి నుంచి శ్రీలంక క్రికెటర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ పర్యటనను అంతర్జాతీయ క్రికెట్ దేశాలు బహిష్కరించాయి.












Click it and Unblock the Notifications