వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎల్జీబీటీ చరిత్ర: స్వలింగ సంపర్కుల చరిత్రను కూడా ఆధునిక జీవితంలో భాగమైన సాధారణ చరిత్రలా తెలియచేయడం కూడా ముఖ్యమని చరిత్ర కారులు అంటున్నారు.

స్వలింగ సంపర్కుల గురించి మనకు తెలియని చరిత్ర చాలా ఉంది. ఈ చరిత్ర ఏ స్కూలు పాఠ్యాంశాల్లోనూ ఉండదు. చాలా వరకు వీరి చరిత్ర రహస్యంగానే ఉండి పోవడం కూడా ఇందుకొక కారణం.

"19వ శతాబ్దంలో కూడా స్వలింగ సంపర్కుల ఉనికి గురించి మాట్లాడటం చాలా కష్టమైన విషయం" అని నాటింగ్‌హాం యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్ హ్యారీ కాక్స్ చెప్పారు.

"18వ శతాబ్దంలో పబ్‌లు, కాఫీ హౌస్‌లను పురుషులు కలుసుకునే వేశ్యా గృహాలుగా భావించేవారు. కానీ, అక్కడకు వెళ్లిన పురుషులు తిరిగి, తమ భార్యాపిల్లల దగ్గరకు కూడా వెళుతూ ఉండేవారు" అన్నారు కాక్స్.

"ప్రజలు సమాజంలో ఉన్న ఈ లైంగిక విధానాలను ఎప్పటికప్పుడు సవాలు చేస్తూనే ఉన్నారు" అన్నారాయన. "మనకున్న కోరికలకు అనుగుణంగా ఈ ప్రపంచాన్ని సమన్వయం చేయాలనుకునే ఆలోచన మాత్రం ఇటీవల కాలంలోనే పుట్టింది" అని కాక్స్ అభిప్రాయపడ్డారు.

స్వలింగ సంపర్కుల చరిత్రను కూడా ఆధునిక జీవితంలో భాగమైన సాధారణ చరిత్రలా తెలియచేయడం కూడా ముఖ్యం" అని లండన్‌లోని గోల్డ్ స్మిత్స్ యూనివర్సిటీలో క్వీర్ హిస్టరీలో సీనియర్ లెక్చరర్ జస్టిన్ బెంగ్రీ చెప్పారు.

"స్వలింగ సంపర్కుల చరిత్ర ఎవరికీ తెలియకుండా చాలా చోటు చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త కథలు తెలుస్తూనే ఉన్నాయి. ప్రధాన విద్యా స్రవంతిలోకి రావల్సిన సమాచారం ఇంకా చాలా ఉంది" అని జస్టిన్ అన్నారు.

18వ శతాబ్దంలో స్వలింగ సంపర్కుల గురించి మాట్లాడలేనంత మాత్రాన ఆ కాలంలో వారు లేరని చెప్పడానికి లేదు

స్వలింగ సంపర్కుల రహస్య పత్రిక

1954లో స్వలింగ సంపర్కుల కోసం ఒక పత్రికను ప్రారంభించినప్పుడు అది పూర్తిగా ఒక రహస్య వ్యవహారంగా నడిచేది. అదెప్పుడూ యూకే న్యూస్ ఏజెంట్ల కళ్ళకు కనిపించకుండా నడిచింది.

"ఆ పత్రికను చూస్తే, ఊహించిన దాని కంటే ఎక్కువ మంది బహిరంగంగా ఛాతీని చూపించిన పురుషులతో కూడిన చిత్రాలతో పాటు, 1950ల నాటి అంశాలు కనిపిస్తాయి" అని డాక్టర్ బెంగ్రీ అన్నారు.

"ఆ పత్రిక వెనుక వైపు ప్రకటనలు ఉండేవి. అందులో ఫొటోగ్రఫీ, కుస్తీ లాంటి అంశాల్లో ఆసక్తి ఉన్న యువ అవివాహిత వ్యక్తుల కోసం చూస్తున్న వారి వ్యక్తి గత ప్రకటనలు కూడా కనిపిస్తాయి" అని చెప్పారు.

ఆ పత్రిక సంపాదక బృందం అందరూ స్వలింగ సంపర్కులే. కానీ, అప్పట్లో ఇంగ్లాండ్, వేల్స్‌లో స్వలింగ సంపర్కం నేరం. అయితే ఆ చట్టాన్ని సవరించి స్వలింగ సంపర్కాన్ని నేరాల పరిధి నుంచి తొలగించిన తర్వాత ఆ పత్రిక మరింత స్వేచ్ఛగా పూర్తిగా నగ్నంగా ఉన్న పురుషుల చిత్రాలను ప్రచురించడం మొదలుపెట్టింది.

"అంతకు ముందు, 50లు, 60లలో కేవలం సినిమాలలో మాత్రమే వీరి గురించి ఆసక్తి ఉండేది. ఆ సినిమాల్లో చాలా మంది పురుషులు కూడా ఉండేవారు".

బ్రిటన్ లో స్వలింగ సంపర్కుల కోసం రహస్య పత్రిక కూడా ఉండేది

అసభ్యకర రీతిలో మహిళలు

1885లో ఇద్దరు పురుషులు అసభ్యంగా ప్రవర్తించడాన్ని చట్ట విరుద్ధం అన్నారు. 1921లో మహిళల కోసం కూడా అలాంటి చట్టాన్నే చర్చించారు. కానీ, ఇది హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ముందుకు వెళ్ళలేదు.

అయితే, ఈ విషయాన్ని చర్చించాలని అనుకోకపోవడం కావచ్చు. లేదా మహిళలు వేరే మహిళతో సెక్స్ చేస్తున్నట్లు తెలిస్తే అలాంటి పనిని పురుషులు కూడా చేద్దామని అనుకుంటారేమోనన్న భయం కావచ్చు.... మొత్తానికి ఈ విషయం పై చర్చ ముందుకు సాగ లేదు.

"ఇలాంటి చర్చ జరగడం వల్ల, మహిళల మధ్య ఉద్రేక పరిచే చర్యలకు అవకాశం ఉందని ఎప్పుడూ ఊహించని అమాయక మహిళలకు ఇది కొత్తగా నేర్పినట్లు అవుతుందని ఆందోళన చెంది ఉంటారు" అని డాక్టర్ బెంగ్రీ అన్నారు.

"పిల్లలకు అర్ధం చేసుకునే వయసు లేదని పెద్దవాళ్లు అనుకుంటారో, 1920లలో మహిళలను బలహీనమైన మేథస్సు కలిగినవారిగా భావించే వారు" అని బెంగ్రీ చెప్పారు.

పార్లమెంటులో చర్చ చేస్తే, మహిళల మధ్య ఉద్రేకపరిచే చర్యలు చోటు చేసుకుంటాయని పార్లమెంటు సభ్యులు ఆందోళన చెంది ఉంటారు

యార్క్‌షైర్‌లో సెక్స్

"ఇది ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ, ప్రతీ తరం సెక్స్ గురించి మొత్తం తామే కనిపెట్టామని అనుకోవడం మాత్రం నిజం. కానీ, అదసలు విషయం కాదు" అని డాక్టర్ బెంగ్రీ అన్నారు. ఆయన లింకన్ యూనివర్సిటీలో డాక్టర్ హెలెన్ స్మిత్ చేసిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించారు.

అందులో 1950లలో యార్క్ షైర్ లో పురుష కార్మికులు పొలాల్లో, పబ్ ల వెనక, ఇళ్లల్లో, పని చేసే స్థలాల్లో తోటి పురుషులతో సెక్స్ చేసేవారని ఆ అధ్యయనంలో చెప్పారు.

స్వలింగ సంపర్కం కొన్ని సమాజాల్లో ఆమోదయోగ్యమేనని హెలెన్ అధ్యయనం తేల్చింది. అందులో చాలా మంది పురుషులు వివాహితులు, చాలా మందికి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే, వారి భాగస్వాములకు కూడా వారు వేరే పురుషులతో సెక్స్ చేస్తున్నట్లు తెలుసు.

పని స్థలాల్లో వారు చేస్తున్న చర్యలు వారి కుటుంబ జీవనం పై ప్రభావం చూపించకపోతే వారు చేసే పని ఆమోదయోగ్యమేనని, ఆమె అధ్యయనం పేర్కొంది.

"వారి రహస్య చర్యల వల్ల కుటుంబాన్ని విచ్చిన్నం కాకుండా , వారి భార్యలను వదిలి పెట్టకుండా, వారి పిల్లలను ఆకలితో వదిలేయకుండా ఉన్నంత వరకు దానిని సాధారణ సెక్స్ లాగే పరిగణించాలి" అని ఆమె అధ్యయనం సూచించింది.

1394 లో ఎలీనార్ అనే వ్యక్తి సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ దగ్గర ఒక సందులో మరొక వ్యక్తితో సెక్స్ చేస్తుండగా అరెస్టు అయ్యారు.

''ఎలీనార్ మహిళగా, పురుషునిగా.. కొన్నిసార్లు ఆడవాళ్లతో, కొన్నిసార్లు మగవాళ్లతో సెక్స్ చేస్తూ, చాలా అద్భుతమైన, పరిధులు లేని లైంగిక స్వేచ్చా జీవితం గడిపారు" అని ఆ అధ్యయనం తెలిపింది.

అది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కానీ, వివిధ లైంగిక ఆసక్తుల గురించి , విస్తృతమైన భాగస్వాముల గురించి నేటికీ చర్చిస్తున్నారు.

"ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న చర్చకు ఎలీనార్ జీవితం సరిగ్గా అమరుతుంది" అని డాక్టర్ బెంగ్రీ అన్నారు.

1960లలో ఐబిఎం కంప్యూటర్స్

మైక్రోచిప్ మేధావి

ఈ రోజు మనం చదువుతున్న ఈ వ్యాసానికి, 1960లలో ఐబిఎం సంస్థలో కంప్యూటర్ శాస్త్రవేత్తగా పని చేసిన లిన్‌కాన్ వే రూపకల్పన చేసిన సాంకేతికతకు ఎక్కడో ఒకచోట సంబంధం ఉండే అవకాశం ఉంది.

ఆమె మైక్రో చిప్స్ మీద పని చేసిన వ్యక్తుల్లో ఒకరు. కానీ, లిన్ ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో ఆమె పని చేస్తున్న ప్రాజెక్టు ఆగిపోయింది.

"కానీ, ఆమె చేసిన పని వల్ల ఈ రోజు మనం ఈ చిన్న కంప్యూటర్ల ద్వారా మాట్లాడుకోగల్గుతున్నాం’’. అని ''ట్రాన్స్ బ్రిటన్: అవర్ జర్నీ ఫ్రమ్ ది షాడోస్" రచయత, ఉద్యమకారిణి, క్రిస్టీన్ బర్న్స్ న్యూస్ బీట్‌తో అన్నారు.

"ఆమె అన్ని రకాల దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని పని చేసిన వ్యక్తి " అని అన్నారు.

ఆ తర్వాత ఆమె కెరీర్‌ను తిరిగి మొదటి నుంచీ మొదలుపెట్టాల్సి వచ్చింది. ఆమెకిప్పుడు 83 సంవత్సరాలు. 50 ఏళ్ల క్రితం ఆమె పట్ల సంస్థ ప్రవర్తించిన తీరుకు 2020లో ఐబిఎం అధికారికంగా క్షమాపణలు చెప్పింది. ''మాకందరికీ లిన్ ఆదర్శప్రాయం" అని క్రిస్టీన్ అన్నారు.

చాలా మందికి మరణించాక క్షమాపణలు చెప్పారు. కానీ, అవి వారు బ్రతికి ఉండగా చెబితే బాగుంటుందని అన్నారు. ''మేమెక్కడి నుంచి వచ్చామో అర్ధం చేసుకోండి" అని అన్నారు.

"బ్రిటిష్ విద్యా సంస్థల్లో ఎల్‌జిబిటి చరిత్రను కూడా నేర్పిస్తే, అందులో చట్టాల్లో మార్పులు జరిగిన కీలకమైన ఘట్టాలు, జీవితాలు మారిన క్షణాలను కూడా పొందు పరచాలి" అని ప్రొఫెసర్ కాక్స్ అన్నారు.

''స్వలింగ సంపర్కాన్ని నేరాల పరిధి నుంచి తప్పించాలని, దానినొక రోగంగా చూడకూడదని, 1957లో ఉల్ఫెన్ డెన్ నివేదిక సూచించిన విషయాన్ని చరిత్రలో చేర్చాలి. అలాగే, ఇంగ్లాండ్, వేల్స్‌లో స్వలింగ సంపర్కాన్ని నేరాల పరిధి నుంచి తొలగించిన లైంగిక నేరాల చట్టం 1967 గురించి కూడా తెలియాలి’’ అన్నారు కాక్స్

దీంతో పాటు, కన్జర్వేటివ్ ప్రభుత్వం 80లలో విద్యా సంస్థల్లో స్వలింగ సంపర్కం గురించి బోధించడాన్ని నిషేధించే సెక్షన్ 28 కూడా ఉంది. 1988-2000 మధ్యలో స్కాట్ లాండ్ లో, 1988-2003 వరకు ఇంగ్లాండ్, వేల్స్‌లో వీటి గురించి తెలుసుకోవడానికి అనుమతి లేదు.

ఇలాంటివి తెలుసుకోవడం వల్ల సమాజం పని చేసే తీరు గురించి అవగాహన వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తారు.

"ఇది అందరి మైనారిటీలకు, మహిళలకు కూడా వర్తిస్తుంది" అని క్రిస్టీన్ అంటారు. "మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అర్ధం చేసుకోలేకపోతే, ఒకేలాంటి అనుభావాలున్న సంస్కృతిలో ఒక సమాజంగా మన స్థానమెక్కడో అర్ధం చేసుకోలేం" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
LGBT: Does homosexuality have a history ... why is there a demand to pass it on to the future
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X