జనాలపై సింహం బీభత్సం: కాల్చి చంపేశారు(వీడియో)
నైరోబి: కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్‌లో నుంచి ఓ సింహం తప్పించుకుంది. పక్కనే ఉన్న జనావాసాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. అంతేగాక, కనిపించిన వారిపై పంజాను విసిరింది.
దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సింహం దాడిలో పదుల సంఖ్యలో పశువులకు గాయాలయ్యాయి. కాగా, సింహాన్ని బంధించాలన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేదేం లేక, అటవీ శాఖ అధికారులు ఆ సింహాన్ని కాల్చి చంపేశారు.
ఆ సింహాన్ని సజీవంగానే పట్టుకోవాలని యత్నించినప్పటికీ.. విఫలం కావడంతో తప్పని పరిస్థితుల్లో కాల్చి చంపేయాల్సి వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. లేదంటే మరికొందరు సింహం బారిన పడేవారని చెప్పారు.












Click it and Unblock the Notifications