గొంతు కోస్తానంటూ పాక్ అధికారి వార్నింగ్! ..చూపించిన భారతీయులు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్థాన్ మరోసారి బహిరంగగానే బరితెగింపునకు పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ప్రవాస భారతీయులు భారీ నిరసన చేపట్టారు. ఇది చూసిన అక్కడున్న పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి.. భారతీయ నిరసనకారులను ఉద్దేశిస్తూ.. గొంతు కోస్తా అన్నట్లుగా సంజ్థ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పాక్ ఆర్మీ, వైమానిక సలహాదారు కల్నల్ తైమూర్ రహత్.. భారతీయ నిరసనకారులపై బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది పాక్ ఆర్మీ బరితెగింపుతనాన్ని, నీచబుద్ధిని, రక్ష దాహాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. దీనిపై భారతీయ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ భద్రతా దళాల ముందే పాక్ అధికారి రెచ్చిపోవడం గమనార్హం.

London Pakistani official warns Indians of throat slitting

పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన విషయం విదితమే. దీనిపై లండన్‌లోని పాక్ రాయబార కార్యాలయం ఎదుట ప్రవాస భారతీయులు పెద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. భారతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

.. చూపించిన భారతీయులు

పాక్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు భారతీయులు.. వారికి ధీటుగా బదులిచ్చారు. మీకు సీటు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవంటూ ఓ అంకుల్ ఎద్దేవా చేశాడు. మీకు నీళ్లు లేవు.. చాయ్ కూడా లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరో యువకుడు పాక్ తీరుకు గట్టిగా బదులిచ్చాడు.

పాక్ అధికారులకు.. అర్జున్ రె్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ అరెయ్ అమిత్ అంటూ సంజ్ఢలను చేసినట్లుగా ఇక్కడ ఓ భారతీయుడు రిపీట్ చేశాడు. గుద్ది పడేస్తామంటూ సంకేతాలు చేశాడు. పెద్ద ఎత్తున భారతీయులు పాక్ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ యూకే పోలీసులు భారీగా మోహరించారు. ఇరుపక్షాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూశారు.

కాగా, భారతీయులు నిరసనలు చేస్తుండగా.. పాకిస్థాన్ హై కమిషన్‌ పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పాకిస్థాన్ పెంచి, పోషిస్తున్న ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించారు. పైగా ఇప్పుడు పాక్ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. పాక్ అధికారులు దౌత్యం, మానవత్వం వదిలి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ నిరసనకారులు మండిపడ్డారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం విధితమే. ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. మతం, పేర్లు అడిగి మరీ చంపారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను కట్ చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+