హై టెన్షన్: బ్యాంకులు, ఏటీఏం వద్ద జనం పడిగాపులు, నగదు కోసం పెద్ద క్యూ

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. తాలిబ‌న్లు అధికారం హస్తగతం చేసుకోవడంతో సిచుయేషన మారింది. అక్కడి ప్రజల్లో భయాందోళనలకు గురవుతున్నారు. వేరే దేశం నుంచి వచ్చి ఆఫ్గానిస్థాన్లో ఉన్నవారు అక్కడనుంచి వారి స్వదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఆఫ్గానిస్తాన్ దేశస్తులు కూడా అవకాశం ఉన్నంత వరకూ దేశాన్ని విడిచిపోవాలని భావిస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చిన పరిస్థితి ఉంది.

ఆఫ్గానిస్తాన్‌లో నాయకుల పాలన పోయి ఉగ్రపాలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఉపాధి క‌ర‌వు అవుతుంద‌ని, ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. ప్రాణాలే పోతాయని ప్ర‌జ‌లు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

Long lines at Kabul ATMs as panic grips for taliban rule

బ్యాంకుల్లో ఉన్న నగదుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్యాంకులు, ఏటీఎంల‌లో ఉన్న డబ్బును డ్రా చేసుకోవ‌డానికి ఎగబడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున‌ బారులు తీరారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డ‌బ్బు తమకు దక్కదేమోనని భయపడుతున్నారు. డబ్బులు డ్రా చేసుకోవాటానికి భారీగా ఏటీఎంలు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు.

తాలిబన్లు ఎప్పుడు తమమీద విరుచుకుపడతారో తెలియక క్షణమొక యుగంలా గుడుపుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు కూడా బహిరంగ ప్రదేశాలకు వచ్చి బిక్కు బిక్కుముంటు గడుపుతున్నారు. ఇళ్లమీద ఎక్కడ బాంబులతో దాడులు చేస్తారేమోనని.. తమ కష్టార్జితానికే కాదు తమ బతుకులకు భరోసా ఉండదని భావిస్తున్నారు. ప్రాణాలకు భద్రత లేని దారుణ పరిస్థితుల్లో ఆఫ్గాన్ ప్రజలు ఉన్నారు.

మరోవైపు భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కాబూల్‌లో ల్యాండయ్యింది. ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం సోమవారం సాయంత్రం దిగింది. అక్కడ గల భారతీయులు, ఎంబసీ స్టాప్‌ను తీసుకొస్తారు. ఇవాళ ఉదయం తజకిస్తాన్‌లో విమానం ఆగాల్సి వచ్చింది. కాబూల్‌లో గందరగోళ పరిస్థితుల దృష్ట్యా.. అక్కడే ఆగింది. అమెరికా దళాలు ఎయిర్ ఫీల్డ్ నియంత్రణ పొందిన తర్వాత.. దిగింది. అయితే కాబూల్‌లో 500 మంది వరకు భారతీయులు ఉన్నట్టు సమాచారం. వారిలో రాయబార కార్యాలయ సిబ్బంది, ఐటీబీపీ స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+