ప్రపంచంలో అతిపెద్ద లాటరీ: రూ.4400 కోట్లు జాక్‌పాట్
వాషింగ్టన్: అమెరికాలో భారీ లాటరీ విజేత ఎవరో రేపు (శనివారం) తేలనుంది. ఈ లాటరీ విజేత 675 మిలియన్ డాలర్లు గెలుచుకోనున్నాడు. ఇది ప్రపంచంలోనే అతి భారీ లాటరీ అని చెప్పవచ్చు. మన రూపాయల్లో ఇది రూ.4,400 కోట్ల వరకు ఉంటుంది.
కోటీశ్వరులు కావాలని కలలు కంటున్న వారిలో ఉత్కంఠను పెంచే రీతిలో నిర్వహించనున్న ఈ లాటరీలో విజేతకు భారీ మొత్తం లభించనుంది.

‘పవర్ బాల్ జాక్‌పాట్'గా ఈ లాటరీని పిలుస్తారు. 2012 మార్చి 30న నిర్వహించిన లాటరీలో ముగ్గురు విజేతలు గెలుచుకున్న 656 మిలియన్ డాలర్ల బహుమతే ఇప్పటి వరకు అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు గెలుచుకునే వ్యక్తి అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ విజేతగా నిలుస్తాడు.












Click it and Unblock the Notifications