మారిషసల్‌లో 6.6 తీవ్రతతో భూకంపం: జనం బయటకు పరుగులు
పోర్ట్‌లూయీస్: మారిషస్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం రిక్టారు స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. దాదాపు నిమిషంపాటు భూమి కంపించినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లోని సామాన్లు కదలాడాయి. దీంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మారిషస్ - రీయూనియన్ దీవులకు సమీపంలో భూకంపం సంభవించింది. మారిషస్‌లోని మదూర్‌కు దక్షిణాన 412 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంపానికి సునామీ హెచ్చరిక జారీ కాలేదు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.












Click it and Unblock the Notifications